హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bandi Sanjay: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బండి సంజయ్ సంచలన ఆరోపణలు

Bandi Sanjay: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బండి సంజయ్ సంచలన ఆరోపణలు

బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

Telangana: గత ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్- 1 పరీక్షతో సహా టీఎస్పీఎస్సీ పరీక్షలన్నీ లీక్ అయ్యాయని బండి సంజయ్ సంచలన ఆరోపించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన సంచలనం సృష్టించింది. దీనిపై టీఎస్పీఎస్సీ బోర్డు సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. మరికాసేపట్లోనే దీనిపై టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి (TSPSC Janardhan Reddy) మీడియాతో మాట్లాడనున్నారు. ఇదిలా ఉంటే ఈ అంశంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు. ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ది లీకేజీ, ప్యాకేజీ, నిరుద్యోగుల డ్యామేజీ సర్కార్ అని ఆరోపించారు. గత ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్- 1 పరీక్షతో సహా టీఎస్పీఎస్సీ పరీక్షలన్నీ లీక్ అయ్యాయని సంచలన ఆరోపించారు. పేపర్ లీక్(Paper Leak Issue) చేసిన నిందితుడు ప్రవీణ్‌కు అత్యధిక మార్కులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్లగా ఇళ్లను వదిలేసి వచ్చి కష్టపడి చదువుతోన్న నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు.

టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులను తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మరో రెండు నెలల్లో జరిగే టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్లు కూడా సీఎం కేసీఆర్ టీమ్‌కు లీక్ అయ్యాయని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. సింగరేణి పరీక్ష పత్రాలు కూడా లీక్ అయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన పేపర్ల లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు TSPSC ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రవీణ్ సహా 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇక తాజాగా ఈ కేసు దర్యాప్తులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సిట్ కు అప్పగిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.

TSPSC పేపర్ లీక్ కేసులో బిగ్ ట్విస్ట్..సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు

కత్తులు, గొడ్డళ్లతో అటవీశాఖ అధికారులను తరిమిన గుత్తి కోయలు..!

సిట్ చీఫ్ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ విచారణ జరగనుంది. పేపర్లు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో దర్యాప్తు సిట్ చేతికి వెళ్లడంతో కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

First published:

Tags: Bandi sanjay, TSPSC

ఉత్తమ కథలు