TELANGANA BJP LEGAL CELL DEMANDS FOR CBI ENQUIRY ON LAWYAR VAMANRAO COUPLE MURDER CASE AND ASKS ADVOCATES NOT TO PROVIDE LEGAL ASSISTANTS TO KILLERS BA KNR
Lawyer Murder Case: న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసులో బీజేసీ సరికొత్త డిమాండ్
వామన్ రావు, నాగమణి (File)
వామనరావు దంపతుల హత్య విషయంలో నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు న్యాయవాదుల హత్య పై సీరియస్ గా కనపడకపోవడం చూస్తుంటే న్యాయవాదులపై ఎలాంటి ధోరణి తో ఉన్నారో అర్థమవుతోందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హై కోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి ల క్రూర హత్య సభ్య సమాజానికి చీకటి రోజని న్యాయాన్ని కాపాడే న్యాయవాదులకు రాష్ట్రంలో రక్షణ లేకపోవడం సిగ్గుచేటని, రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అని బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్ బృందం ప్రశ్నించింది. న్యాయవాద దంపతుల హత్యను నిరసిస్తూ ఆదివారం బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్ ఆధ్వర్యంలో చలో గుంజపడుగు కార్యక్రమాన్ని చేపట్టింది. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి బస్సులలో బయలుదేరిన బీజేపీ లీగల్ సెల్ బృందం పలు జిల్లాల మీదుగా ప్రయాణం కొనసాగించి మొదట హత్యా స్థలాన్ని సందర్శించి, తదనంతరం మంథని మండలం గుంజపడుగు లోని న్యాయవాద కుటుంబాన్ని పరామర్శించింది. ఈ సందర్భంగా బీజేపీ లీగల్ సెల్ నాయకులు మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో న్యాయవాదుల పాత్ర ఎంతో ఉందని, అలాంటి న్యాయవాదులకు నేడు రాష్ట్రంలో ప్రభుత్వం రక్షణ లేకపోవడం సిగ్గుచేటన్నారు. మంథని ప్రాంతంలో న్యాయాన్ని బతికించడానికి న్యాయవాదులు ప్రజల కోసం పోరాటం చేస్తే కక్ష గట్టి హత్య చేయడం దారుణం అన్నారు.
వామనరావు దంపతుల హత్య విషయంలో నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు న్యాయవాదుల హత్య పై సీరియస్ గా కనపడకపోవడం చూస్తుంటే న్యాయవాదులపై ఎలాంటి ధోరణి తో ఉన్నారో అర్థమవుతోందన్నారు. న్యాయాన్ని కాపాడే న్యాయవాద వ్యవస్థ పై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని, ఇలాంటి సంఘటనలు భవిష్యత్ లో పునరావృతం కాకూడదు అంటే ఆర్డినెన్స్ ద్వారా న్యాయవాద రక్షణ చట్టం (Advocates Protection Act) ను తక్షణమే తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు డిమాండ్ చేశారు.
న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు స్వాగతించాల్సింది పోయి, చెడు ఆలోచనలతో కక్షిదారులు, నేరస్థులు న్యాయవాదులపై ద్వేషం పెంచుకొని దాడి చేయడం, హత్యలు చేయడం చూస్తుంటే న్యాయవాదులకే కాకుండా మొత్తం సమాజానికే తలవంపు వచ్చేలా ఉందని, ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదన్నారు. ఇలాంటి ఘటనపై కఠినంగా వ్యవహరించకపోతేఇలాంటి సంఘటనలు ఇంకా జరుగుతాయని, భవిష్యత్ లో న్యాయవాదుల పై దాడులు పునరావృతం కాకూడదు అంటే న్యాయవాద రక్షణ చట్టం తేవడంతో పాటు న్యాయవాద లోకం ఎవరు కూడా న్యాయవాదులపై దాడులు చేసే నేరస్థులకు వకాలత్ పుచ్చుకోవద్దు అని విజ్ఞప్తి చేసారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన న్యాయవాద దంపతుల హత్య సంఘటనలో కూడా న్యాయవాదులు ఎవరు కూడా నేరస్థుల తరపున వకాలత్ చేయవద్దని, ఈ హత్య సంఘటనలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐ తో విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని, ఇందులో అధికార పార్టీ ప్రముఖులు, అధికారుల పాత్ర ఉందని ప్రజలు చేర్చించుకుంటున్నారని, ఈ అనుమానాలను నివృత్తి కావాలంటే సీబీఐతో విచారణ జరిపిస్తేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని వారు తెలిపారు. హత్య సంఘటన పై నిష్పాక్షిక విచారణ జరపాలని, ఇట్టి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి త్వరితగతిన కేసును దర్యాప్తు పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలు గాని, పోలీసులు గాని కేసును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తే న్యాయవాదులు లోకం నుండి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.