TELANGANA BJP LEADER JITTA BALAKRISHNAREDDY WAS ARRESTED BY THE POLICE AT MIDNIGHT IN A CASE OF INSULTING KCR PRV
BJP Leader arrest: తెలంగాణ బీజేపీ నేత అరెస్టు.. అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బండి సంజయ్ ఆగ్రహం
పోలీసు వాహనంలో జిట్టా
తెలంగాణ బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై పార్టీ చీఫ్ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ బీజేపీ లీడర్ జిట్టా బాలకృష్ణారెడ్డి (Telangana BJP leader jitta Balakrishnareddy )ని గురువారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూన్ 2వ తేదీన నిర్వహించిన ‘అమరుల యాదిలో.. ఉద్యమ ఆకాంక్షల సాధన సభ’లో కేసీఆర్ను కించపరిచేలా ‘నాటకం’ (Skit) వేశారని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన పోలీసులు జిట్టా బాలకృష్ణారెడ్డిని అరెస్టు (Police arrested) చేశారు. కాగా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తనను అరెస్టు చేయడమేంటని జిట్టా పోలీసులను ప్రశ్నించారు. అయితే ఆయన మాటలను పట్టించుకోని పోలీసులు బలవంతంగా ఆయనను అరెస్టు చేశారు. అయితే జిట్టాను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లిందీ తెలియరాలేదు.
అర్ధరాత్రి ఎలాంటి నోటీసు లేకుండా పోలీసులు తమ పార్టీ నేతను అరెస్టు చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (BJP state president Bandi Sanjay) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దోపిడీ దొంగలమాదిరిగా తమ పార్టీ నేతను కిడ్నాప్ చేశారని ఆయన మండిపడ్డారు. వెంటనే జిట్టా ఆచూకీ తెలపాలని, ఆయనను విడుదల చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. జిట్టాకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. మరోవైపు జిట్టా అరెస్టుపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి (Konda Vishweswarareddy) సైతం స్పందించారు. జిట్టా బాలకృష్ణా రెడ్డి అరెస్టును ఖండిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
కాగా, అందుతున్న సమాచారం మేరకు ఉదయం జిట్టా బాలకృష్ణకు బెయిల్పై బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఫేస్బుక్ పేజీలో పోస్టు పెట్టారు.“బీజేపీ నాయకులు,తెలంగాణ ఉద్యమకారులు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి గారికిబెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి జిల్లా కోర్టు.. జిట్టా గారి అరెస్ట్ ను ఖండించి, మద్దతుగా నిలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు Bandi Sanjay Kumar గారికి , బీజేపీ రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, ప్రతి ఒక్క కార్యకర్తకు పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదాలు.”అని తెలిపారు.
బండి సంజయ్ ఇంటి వద్ద పోలీసులు..
మరోవైపు బండి సంజయ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బండి సంజయ్ జేబీఎస్ కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకునేందుకు పోలీసులను మోహరించారు. తెలంగాణ ఆర్టీసీ Diesel Cess పేరుతో ప్రయాణీకులపై భారం మోపడంపై బీజేపీ శుక్రవారం నాడు నిరసనలకు పిలుపునిచ్చింది.జేబీఎస్ లో ప్రయాణీకులతో ముఖాముఖి కార్యక్రమానికి బీజేపీ ప్లాన్ చేసింది.ఈ కార్యక్రమానికి బండి సంజయ్ వెళ్లకుండా ఆపేందుకు పోలీసులు భారీ ఎత్తున సంజయ్ ఇంటికి చేరుకున్నారు. బండి సంజయ్ ఇంటి బయటకు వెళ్తే అక్కడే ఆయనను అడ్డుకోనున్నారు. పోలీసుల తీరును బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పు బట్టారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని బండి సంజయ్ విమర్శించారు. ప్రశ్నించే గొంతులను , నిరసన గళాలనుు అణచివేసే కుట్రలు చేస్తున్నారన్నారు. అరెస్టులు, అణచివేతలతో బీజేపీ ఉద్యమాన్ని ఆపలేరన్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.