Home /News /telangana /

TELANGANA BJP LEADER EX MINISTER PEDDIREDDY UNHAPPY WITH ETELA RAJENDAR ENTRY NEWS INTO BJP AK

Etela Rajendar: బీజేపీలోకి ఈటల రాజేందర్.. కమలం పార్టీకి ఊహించని షాక్ తగలనుందా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Etela Rajendar: బీజేపీలోకి వెళ్లేందుకు ఈటల రాజేందర్.. ఆయనను చేర్చుకునేందుకు కమలం పార్టీ రెడీ అవుతుండగా... ఆ పార్టీలో కొనసాగుతున్న ఓ సీనియర్ నేత ఇప్పుడు ఈటల రాజేందర్ రాకపై తీవ్ర అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది.

    తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మాజీమంత్రి ఈటల రాజేందర్ హాట్ టాపిక్‌గా మారారు. టీఆర్ఎస్‌కు దూరమైన ఆయన బీజేపీకి దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది. కొద్దిరోజులుగా బీజేపీ నేతలు ఈటలతో సమావేశమవుతున్నారు. ఆయనను పార్టీలోకి తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. ఈటల సైతం బీజేపీలోకి వెళ్లేందుకు మానసికంగా సిద్ధమైపోయారనే ప్రచారం తెలంగాణ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈటల రాజేందర్‌ను బీజేపీలోకి వస్తున్నారనే విషయాన్ని చెబుతూ.. పలువురు బీజేపీ నేతల అభిప్రాయాలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన బీజేపీ అధినాయకత్వం ముందుంచే అవకాశం ఉందని సమాచారం.

    బీజేపీలోకి వెళ్లేందుకు ఈటల రాజేందర్.. ఆయనను చేర్చుకునేందుకు కమలం పార్టీ రెడీ అవుతుండగా... ఆ పార్టీలో కొనసాగుతున్న ఓ సీనియర్ నేత ఇప్పుడు ఈటల రాజేందర్ రాకపై తీవ్ర అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో హుజూరాబాద్ నుంచి పలుసార్లు గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన పెద్దిరెడ్డి.. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే హుజూరాబాద్ నుంచి బీజేపీ తరపున పోటీ చేయాలని భావిస్తున్న పెద్దిరెడ్డికి తాజా పరిణామాలు మింగుడుపడటం లేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

    Etela Rajendar news, peddireddy news, telangana news, etela rajendar versus peddireddy, ఈటల రాజేందర్, పెద్దిరెడ్డి న్యూస్, తెలంగాణ న్యూస్, ఈటల రాజేందర్ వర్సెస్ పెద్దిరెడ్డి
    అమిత్ షాతో ఇనుగాల పెద్దిరెడ్డి (ఫైల్ ఫోటో)


    భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన నాయకుడికి ఆత్మగౌరవం ఉంటే... తనకు ఆత్మగౌరవం ఉండదా అని ప్రశ్నించారు. ఈటలను పార్టీలోకి తీసుకుంటున్నట్టు బీజేపీ నేతలెవరూ తనను సమాచారం ఇవ్వలేదని అన్నారు. తాను హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మొత్తానికి ఈటల రాజేందర్ బీజేపీలోకి ఎంట్రీ ఇస్తే.. ఇప్పటివరకు హుజూరాబాద్‌లో బీజేపీ తరపున కీలక నేతగా ఉన్న మాజీమంత్రి పెద్దరెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Etela rajender, Telangana

    తదుపరి వార్తలు