Home /News /telangana /

BJP : ఇది నిజమా..? బీజేపీ సంచనల కామెంట్స్ .. 25 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు.. తరుణ్ చుగ్

BJP : ఇది నిజమా..? బీజేపీ సంచనల కామెంట్స్ .. 25 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు.. తరుణ్ చుగ్

బీజేపీ రాస్ట్ర కార్యవర్గ సమావేశం

బీజేపీ రాస్ట్ర కార్యవర్గ సమావేశం

BJP : బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్‌ చుగ్ టీఆర్ఎస్ పై సంచనల వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసిఆర్‌కు తాజాగా ఢిల్లీ సెగ తగిలిందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుండి 25 ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
  బీజేపీ రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశాలు హైదరాబాద్‌లో కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.( bjp incharge Tarun chugh ) సమావేశాల్లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఢిల్లీలో షాక్ తలిగిందని అన్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ కనీసం పోటి చేసేందుకు కూడా 60 మంది సభ్యులు ముందుకు రారని అన్నారు. ( Tarun chugh made sensational comments ) ఈ సంధర్భంలోనే తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా... బీజేపీ 80 స్థానాలు గెలువనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ సత్తా తెలుస్తుందని అన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది ముగిసిన అధ్యాయనమని పేర్కోన్నారు. వ్యవసాయ చట్టాల రద్దుతో ఒక వర్గం రైతులు బాధపడ్డారని, చట్టాలు అమల్లోకి వస్తే చాలా బాగుండేదన్నారు.

  ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఓవైపు ఢీల్లీ ( Delhi ) మరోవైపు తెలంగాణ ( Telangana ) ఇప్పటికే రైతుల అంశంపై ఎవరికి వారు వ్యుహాలు రచించి ప్రత్యర్థి పార్టీలను ఇరుకును పెట్టే ప్రయత్నాలకు తెరలేపారు. ఈ క్రమంలోనే వరి కొనుగోలుపై ( paddy ) తాడోపేడో తేల్చుకుని వస్తామని చెప్పి వెళ్లిన సీఎం కేసీఆర్‌ ( cm kcr ) కనీసం ఒక మంత్రిని కూడా కలువకుండానే తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఆ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం అసలు సీఎం కేసిఆర్ ప్రధాని ( pm modi ) అపాయింట్‌మెంట్ కూడా అడగలేదని తేల్చి చెప్పారు. దీంతో ఇరు పార్టీల మధ్య రాజకీయా ( political war ) పోరాటానికి తెర లేపినట్టయింది. అయితే ఈ పోరాటంలో భాగంగానే బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ మాటలు చూడాలా ..? లేక నిజంగా టీఆర్ఎస్ ( trs) పార్టీ నుండి ఎమ్మెల్యేలు ఆ పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారా అనేది తేలాల్సిన అంశం.

  MLA Jaggareddy : మంత్రి హరీష్‌రావు.. ఇలా చేస్తే.. ఎమ్మెల్సీగా పోటి నుండి విత్ డ్రా


  అయితే ఇలాంటీ వ్యాఖ్యలనే గతంలో కూడా రాష్ట్ర బీజేపీ ( bjp ) నేతలు చేశారు. అయితే అప్పుడు పెద్దగా పట్టించుకున్న పరిస్థితి మాత్రం కనిపించలేదు. కాని హుజురాబాద్ ( huzurabad by elections ) ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారింది. టీఆర్ఎస్ పార్టీలో కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దీంతో కొన్ని జిల్లాల్లో కింది స్థాయి నేతలు కూడా ఆపార్టీ మాట వినని పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కరీంనగర్‌లో ( karimnagar ) మాజీ మేయర్, ప్రస్తుత కార్పోరేటర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటికి దిగడంతోపాటు కార్పోరేటర్ పదవికి , పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. దీంతో రానున్న రోజుల్లో అవకాశాలు దక్కని పార్టీ నేతల జంపింగ్‌లు సాధారణంగా మారే అవకాశలే కనిపిస్తున్నాయి.

  Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

  మీ నగరం నుండి (​హైదరాబాద్)

  తెలంగాణ
  ​హైదరాబాద్
  తెలంగాణ
  ​హైదరాబాద్
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Hyderabad, Telangana bjp, Trs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు