'కన్నతల్లికి అన్నం పెట్టనోడు'...సీఎం కేసీఆర్‌పై లక్ష్మణ్ సెటైర్లు

తెలంగాణ భూములు ఎండిపోతుంటే పట్టించుకోని సీఎం..రాయలసీమను సస్యశ్యామలం చేస్తారట..అని ఎద్దేవా చేశారు లక్ష్మణ్.

news18-telugu
Updated: August 13, 2019, 3:26 PM IST
'కన్నతల్లికి అన్నం పెట్టనోడు'...సీఎం కేసీఆర్‌పై లక్ష్మణ్ సెటైర్లు
కేసీఆర్, లక్ష్మణ్
news18-telugu
Updated: August 13, 2019, 3:26 PM IST
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను బీజేపీ చీఫ్ లక్ష్మణ్ మరోసారి టార్గెట్ చేశారు. ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. జగన్‌కు పెద్దన్నలా ఉండి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామన్నకేసీఆర్ వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు తెలంగాణ బీజేపీ చీఫ్. రాయలసీమను రతనాలసీమగా మారుస్తామన్న సీఎం వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ భూములు ఎండిపోతుంటే పట్టించుకోని సీఎం..రాయలసీమను సస్యశ్యామలం చేస్తారట..అని ఎద్దేవా చేశారు లక్ష్మణ్.

కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నడట. సింగూరు, నిజాం సాగర్ లకు చుక్కనీరు రాకుండా తెలంగాణ భూములు బీడు పారుతుంటే పట్టించుకోరు. కానీ రాయలసీమను మాత్రం రతనాలసీమగా మారుస్తారట.
లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ చీఫ్
కాగా, సోమవారం తమిళనాడులోని అత్తి వరదరాజ స్వామి ఆలయాన్ని కేసీఆర్ కుటుంబ సభ్యులు సందర్శించిన విషయం తెలిసిందే. ఆలయ దర్శనం అనంతరం నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాయలసీమపై కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. రాయలసీమ అభివృద్ధి కోసం ఏపీ సీఎం జగన్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. రాయలసీమకు గోదావరి జలాలు రావాల్సి ఉందన్న ఆయన.. రాయలసీమను రతనాలసీమగా చేసేందుకు తమ వంతుసాయం చేస్తామని వెల్లడించారు. ఇద్దరం కలిసి తెలుగువారి చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించబోతున్నామని.. దీన్ని కొందరు జీర్ణించుకోవడం లేదని విమర్శించారు సీఎం కేసీఆర్.
First published: August 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...