టీఆర్ఎస్ పని అయిపోయింది... ప్రభుత్వంపై లక్ష్మణ్ ఫైర్...

Telangana : తెలంగాణలో జరుగుతున్న పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తున్న లక్ష్మణ్... టైమ్ చూసి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.

news18-telugu
Updated: October 18, 2019, 12:46 PM IST
టీఆర్ఎస్ పని అయిపోయింది... ప్రభుత్వంపై లక్ష్మణ్ ఫైర్...
టీఆర్ఎస్ పని అయిపోయింది... ప్రభుత్వంపై లక్ష్మణ్ ఫైర్...
news18-telugu
Updated: October 18, 2019, 12:46 PM IST
Telangana News : తెలంగాణలో ఆల్రెడీ ఆపరేషన్ కమలం స్టార్ట్ చేసి... వీలు చిక్కినప్పుడల్లా కేసీఆర్ సర్కార్‌ను ఉతికారేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్... తాజాగా మరోసారి అదే చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఎదురుతిరిగాయన్న ఆయన... ఆర్టీసీ ఉద్యోగులతోపాటూ... రేపటి నుంచీ ఉబెర్, ఓలా కార్మికులు, ఉద్యోగులు, క్యాబ్ డ్రైవర్లు కూడా నిరవధిక సమ్మెకు దిగుతున్నారని అన్నారు. ఆర్టీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన పడుతోందన్న లక్ష్మణ్... తెలంగాణలో కార్యకలాపాలు స్తంభించాయన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని అనుమానం కలుగుతోందన్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా... రవాణా శాఖ మంత్రి స్పందించకపోవడం బాధాకరమన్న లక్ష్మణ్... పాలన అటకెక్కించి కేవలం తన ప్రతిష్ట కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని పరోక్షంగా సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేశారు.

మళ్లీ తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా భారీ ఉద్యమానికి బీజేపీ నాంది పలుకుతుందన్నారు లక్ష్మణ్. మొత్తంగా చూస్తే... బీజేపీ క్రమంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల దాటిని పెంచుతున్నట్లు కనిపిస్తోంది. ఆల్రెడీ గవర్నర్ తమిళిసైని ఢిల్లీకి పిలిపించి... ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా చేస్తున్న కమలం పెద్దలు... ఇప్పటి ఆర్టీసీ సమ్మెను కూడా చక్కగానే క్యాష్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అవతల హుజూర్‌నగర్ అసెబ్లీ ఉప ఎన్నిక జరగబోతున్న టైంలో... ఇటు ఆర్టీసీ సమ్మె, ఓలా సమ్మె, ప్రభుత్వ ఉద్యోగుల అలకలు సర్కారుకు సవాల్ విసురుతున్నాయి. మరి ఈ పరిస్థితులను సీఎం కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తి రేపుతోంది.

 

Pics : కొంచెం హాట్... కొంచెం స్వీట్ అంటున్న లవ్లీ బ్యూటీ శాన్వి శ్రీవాత్సవ
ఇవి కూడా చదవండి :


దీపావళికి క్రాకర్స్ కాల్చొద్దన్న స్పైస్ జెట్‌... నెటిజన్స్ ఫైర్
Loading...
ఏపీ ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు... చంద్రబాబు టార్గెట్ ఇదీ...

Health Tips : సీజనల్ ఫ్రూట్ సీతాఫలం తినండి... ఈ ప్రయోజనాలు పొందండి

Diabetes Tips : జామకాయలతో డయాబెటిస్‌కి చెక్... ఇలా చెయ్యండి

Health Tips : రోజా పూలతో చక్కటి ఆరోగ్యం... ఇలా చెయ్యండి

First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...