Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్ర.. చార్మినార్ నుంచి హుజురాబాద్ వరకు..ఎప్పటి నుంచంటే..

బండి సంజయ్ కుమార్ (ఫైల్)

Bandi Sanjay Padayathra: క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో టీఆర్ఎస్ సర్కార్‌ను గద్దెదించి గోల్కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించడమే తమ లక్ష్యమని బండి సంజయ్ చెప్పారు. ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా సీఎం కేసీఆర్ అవినీతి, గడీల పాలనకు వ్యతిరేకంగా పాదయాత్ర సాగుతుందని తెలిపారు.

  • Share this:
    తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను రచిస్తోంది. అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో పార్టీ ఆఫీసుకే పరిమితం కాకుండా ప్రజాక్షేత్రంలోనే ఉండాలని తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ నిర్ణయించారు. తెలంగాణవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటి నుంచి రెండేళ్ల పాటు పాదయాత్రలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తం నాలుగు, ఐదు విడతలు ఉండేలా రోడ్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే తొలి విడత యాత్ర ఖరారయింది. ఆగస్టు 9న హైదరాబాద్ పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మావారి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్ర అక్టోబరు 2న హుజూారాబాద్ సభతో ముగుస్తుంది. అంటే క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన రోజే యాత్రను ప్రారంభించి.. గాంధీ జయంతి రోజును ముగిస్తారు. మొత్తం 55 రోజుల పాటు 750 కి.మీ. మేర తొలి విడత పాదయాత్ర సాగుతుంది.


    రోజుకు 15 నుంచి 20 కి.మీ. బండి సంజయ్ పాదయాత్ర చేస్తారు. ఆగస్టు 9న తొలిరోజు బేగంబజార్‌-నాంపల్లి-బాపూఘాట్‌ మీదుగా ఆరెమైసమ్మ ఆలయం వరకు పాదయాత్ర సాగుతుంది. అనంతరం చేవెళ్ల మీదుగా ఉమ్మడి రంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లా వరకు పాదయాత్ర చేస్తారు. బండి సంజయ్ పాదయాత్ర కార్యక్రమం విజయవంతం చేసేందుకు పలు కమిటీలను ఏర్పాటుచేయాలని తెలగాణ బీజపేీ నిర్ణయించింది. త్వరలో ఉపఎన్నిలు జరిగే.. హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధి అన్ని మండలాల్లోనూ బండి సంజయ్‌ పాదయాత్ర సాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. హుజుాబాద్ సభ తేదీ విషయంలో అటూ ఇటూగా మార్పులు జరిగే అవకాశముంది.

    క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో టీఆర్ఎస్ సర్కార్‌ను గద్దెదించి గోల్కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించడమే తమ లక్ష్యమని బండి సంజయ్ చెప్పారు. ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా సీఎం కేసీఆర్ అవినీతి, గడీల పాలనకు వ్యతిరేకంగా పాదయాత్ర సాగుతుందని తెలిపారు. పాదయాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అరాచకాల్ని ప్రజల సమక్షంలోనే బహిర్గతం చేస్తానని ఆయన అన్నారు. వందల మంది బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో ఒక కుటుంబం మాత్రమే లాభపడుతుందని..అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని బండి సంజయ్ చెప్పారు. ఈ పాదయాత్ర తెలంగాణలో పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని.. కార్యకర్తలను కూడా ఇప్పటి నుంచే ఎన్నిలకు సన్నద్ధం చేసినట్లు అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఐతే బండి సంజయ్ పాత్రపై టీఆర్ఎస్ నేతలు అప్పుడే విమర్శలు చేస్తున్నారు. హుజురాబాద్ ఎన్నికల కోసమే ఈ డ్రామాలాడుతున్నారని చురకలు అంటిస్తున్నారు.


    .
    Published by:Shiva Kumar Addula
    First published: