Home /News /telangana /

TELANGANA BJP CHIEF BANDI SANJAY SLAMMED TRS GOVERNMENT OVER JOB NOTIFICATIONS AND DEMANDS IMMEDIATE GROUPS NOTIFICATIONS IN STATE PRV

Bandi Sanjay: తెలంగాణలో ఏడేళ్లుగా గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌-​‌‌1 నోటిఫికేషన్​ లేకపోవడం దారుణం.. నోటిఫికేషన్​ తొందరగా ఇవ్వాలి: బండి సంజయ్​

Bandi-Sanjay-Kumar

Bandi-Sanjay-Kumar

తెలంగాణ ప్రభుత్వం గ్రూప్‌ సర్వీసెస్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌ వెంటనే విడుదల చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్​ (Bandi sanjay kumar) డిమాండ్‌ చేశారు

    తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) గ్రూప్‌ (Group) ఉద్యోగాల నోటిఫికేషన్‌ వెంటనే విడుదల చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్​ (Bandi sanjay kumar) డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,600 గ్రూప్‌-1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఏడేళ్లుగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవడం దారుణమని బండి సంజయ్​ అన్నారు. గ్రూప్‌-1 పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఐఏఎస్‌ ఆఫీసర్‌ పోస్టులకు తీవ్ర కొరత ఏర్పడిందని చెప్పారు. ఒక్కో ఐఏఎస్‌ అధికారి 3, 4 పోస్టులకు ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారని బండి సంజయ్‌ (Bandi sanjay) తెలిపారు. రాష్ట్రంలో 4 వేల గ్రూప్‌-2 పోస్టులు, 2 వేల గ్రూప్‌-3 పోస్టులు, 40 వేల గ్రూప్‌-4 పోస్టులు ఖాళీగా ఉన్నాయని బీజేపీ చీఫ్​ వివరించారు. వేలాది గ్రూప్‌ సర్వీసెస్‌ పోస్టుల ఖాళీగా ఉండటంతో పాలన నత్తనడకన సాగుతోందని విమర్శించారు. తక్షణమే పోస్టులు భర్తీ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని సంజయ్‌ ప్రకటించారు.

    వారికి కృతజ్ఞతలు..

    ఎల్కతుర్తి-సిద్దిపేట రోడ్డు విస్తరణ పనులకు కేంద్రం రూ.578.85 కోట్లు మంజూరు చేసిందని బండి సంజయ్‌ వెల్లడించారు. ఈ నిధులు మంజూరు చేసినందుకు , ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి గడ్కరీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని కలిశారు. ఈ రోడ్డు విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, సాంకేతిక అనుమతులకు ఆమోదం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని బండి సంజయ్​ చెప్పారు.

    కాగా, కరోనా నియంత్రణ కోసమే విద్యా సంస్థలను మూసివేస్తున్నామని చెప్పిన సీఎం కేసీఆర్‌.. బార్లు, పబ్బుల మూసివేత విషయంలో అదే ముందు జాగ్రత్త ఎందుకు తీసుకోలేదో చెప్పాలని మాజీ ఎంపీ విజయశాంతి డిమాండ్‌ చేశారు. పబ్బులు, బార్లల్లో కొవిడ్‌ వ్యాపిస్తున్నా ఆదాయం కోసమే వాటిని నియంత్రించకుండా చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. విద్యా వ్యవస్థను నాశనం చేయడానికే రాజకీయ నాటకాలకు తెరతీస్తున్నారని విజయశాంతి ఒక ప్రకటనలో విమర్శించారు.

    జీవో 317ను సవరించాలి:  సీపీఎం

    ప్రభుత్వ ఉద్యోగులను గత నెలరోజులుగా మనోవేదనకు గురిచేస్తున్న జీవో 317ను సవరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్నిమరో ప్రకటనలో డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, స్థానికత కోల్పోయి ఇతర జోన్లు, జిల్లాలకు శాశ్వతంగా బదిలీ అయిన ఉద్యోగులను అవసరమైతే సూపర్‌ న్యూమరరీ పోస్టులు సృష్టించి వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు.

    సీనియారిటీపై అప్పీల్స్, సామాజిక తరగతులకు జరిగిన అన్యాయం, కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం ప్రకటనలకే పరిమితం కాకూడదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో (Government schools) ఇంగ్లిషు మీడియం పేద వర్గాలకు ఉపయోగకరమే అయినప్పటికీ తెలుగు మీడియాన్ని (Telugu medium) పూర్తిగా ఎత్తివేస్తే ఆయా వర్గాలకే నష్టం జరుగుతుందన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bandi sanjay, Government jobs, Group 1, Job notification, Telangana bjp, Telangana notifications, Tspsc jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు