హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bandi Sanjay: కేసీఆర్​​ ఇంగిత జ్ఞానం లేని మూర్ఖుడు.. : బీజేపీ చీఫ్ బండి సంజయ్​ 

Bandi Sanjay: కేసీఆర్​​ ఇంగిత జ్ఞానం లేని మూర్ఖుడు.. : బీజేపీ చీఫ్ బండి సంజయ్​ 

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్

ఇబ్రహీంపట్నం ఘటన రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు ఎంపీ బండి సంజయ్​. పేద ప్రజల ప్రాణాలను కేసీఆర్ గాలికి వదిలేశారని ఇబ్రహీంపట్టణం ఘటన రుజువు చేస్తుందన్నారు ఎంపీ.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఇబ్రహీంపట్నంలో (Ibrahim patnam) కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు (Family planning operations) చేసుకున్న తర్వాత మరణించిన నలుగురికి రూ. కోటి పరిహారంగా చెల్లించాలని బీజేపీ  అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (BJP Chief Bandi sanjay) డిమాండ్ చేశారు. హడావుడిగా ఈ ఆపరేషన్లు చేశారని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను బీజేపీ సంజయ్ బుధవారం  పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అంత బిజీ ఏం ఉన్నారు మంత్రులు అని బండి అన్నారు. అంత పీకుడు పని ఏం చేస్తున్నారని నిలదీశారు బండి. ఇబ్రహీంపట్నం ఘటన రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు ఎంపీ బండి సంజయ్​.రాజకీయాలు చేయడానికి బిహార్..
  ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను సీఎం ఎందుకు పరామర్శించడం లేదని ఫైర్ అయ్యారు బండి సంజయ్ . కెసిఆర్ నువ్వు మనిషివా.. రాక్షసుడివా.. నీ నిర్లక్ష్యం వల్లే నలుగురి మహిళలు ప్రాణాలు కోల్పోయారంటూ మండిపడ్డారు. ఇక్కడ మరణించిన వారిని పట్టించుకోకుండా రాజకీయాలు చేయడానికి బిహార్ వెళ్లాడని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేసీఆర్​​ ఇంగిత జ్ఞానం లేని మూర్ఖుడు అని బండి ఆరోపించారు.
  మృతుల పిల్లలను ప్రభుత్వమే చదివించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలన్నారు బండి. అంతేకాదు మృతుల కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని  సంజయ్ డిమాండ్ చేశారు. ఆరోగ్యశాఖ మంత్రిని భర్తరఫ్ చేయాలని ఆయన కోరారు.ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించిన బాధితులను పరామర్శించకపోవడంపై క్షమాపణ చెప్పాలని ఆయన కేసీఆర్ ను డిమాండ్ చేశారు.


  ఈ శస్త్రచికిత్సలు చేసుకున్న మహిళలు పేద కుటుంబాలకు చెందినవారని బండి సంజయ్ అన్నారు. గంటలోపుగానే 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహించారని బండి సంజయ్ ఆరోపించారు. అంతా హడావుడిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని బండి సంజయ్​ ప్రశ్నించారు. తనకు పేరు ప్రఖ్యాతలు వస్తే చాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారని విమర్శించారు బండి. కానీ పేద ప్రజల ప్రాణాలను కేసీఆర్ గాలికి వదిలేశారని ఇబ్రహీంపట్టణం ఘటన రుజువు చేస్తుందన్నారు ఎంపీ.
  ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేశారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ పేదల ఉసురు తీసుకుంటున్నారని బండి విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో ఆపరేషన్లు వికటించి నలుగురు చనిపోతే పట్టించుకోకుండా బిహర్ వెళ్లి ఏం ఉద్దరిస్తావని కేసీఆర్ ను ప్రశ్నించారు బండి సంజయ్.24 గంటలు రాజకీయాలు చేయడం తప్ప పేద ప్రజల సంక్షేమం కేసీఆర్ కు పట్టదని బండి సంజయ్ మండిపడ్డారు. ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నాడని బండి సంజయ్ ప్రశ్నించారు. ఆరోగ్య శాఖ మంత్రిని అబద్దాల మంత్రిగా యువత పిలుస్తున్నారన్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bandi sanjay, Hyderabad, Rangareddy

  ఉత్తమ కథలు