TELANGANA BJP CHIEF BANDI SANJAY FIRES ON STATE ELECTION COMMISSION FOR NEW CIRCULAR AK
పెన్నుతో టిక్ వేసినా ఓటు వేసినట్టే.. సర్క్యులర్‌పై కోర్టుకెక్కిన బీజేపీ
GHMC Elections: ప్రతీకాత్మక చిత్రం
బ్యాలెట్ పేపర్‌పై స్వస్తిక్ గుర్తే కాకుండా.. ఏ మార్కర్ పెన్నుతో టిక్కు పెట్టినా ఆ ఓటును పరిగణనలోకి తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గురువారం చేసిన సర్క్యులర్‌పై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది.
బ్యాలెట్ పేపర్‌పై స్వస్తిక్ గుర్తే కాకుండా.. ఏ మార్కర్ పెన్నుతో టిక్కు పెట్టినా ఆ ఓటును పరిగణనలోకి తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గురువారం చేసిన సర్క్యులర్‌పై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై హైకోర్టులో హౌస్ మోహన్ దాఖలు చేసింది. మరికాసేపట్లో దీనిపై హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. అయితే కౌంటింగ్ ప్రక్రియకు ఇది అడ్డంకి కాబోదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ సర్క్యులర్‌ను తప్పుబట్టిన ఎస్ఈసీ.. కౌంటింగ్ అధికారులకు మాత్రమే జారీ చేసిన ఆ సర్క్యులర్ వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది. ప్రగతిభవన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఎన్నికల కమిషనర్ ఈ సర్క్యులర్ జారీ చేశారని బీజేపీ ఆరోపించింది. తక్షణం ఆ సర్క్యులర్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేసింది.
ఈ ఘటనపై విచారణ జరిపించాలని.. బాధ్యులైన అధికారులను సర్వీసు నుంచి తొలగించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. అయితే ఎన్నికల కౌంటింగ్‌ను మాత్రం తాము అడ్డుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎస్ఈసీని గ్యాంబ్లర్‌గా అభివర్ణించిన బండి సంజయ్.. ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోతారని విమర్శించారు. ఇక గ్రేటర్లో పోలింగ్ శాతంపై అధికారులు ఇచ్చిన వివరణ కూడా సరిగ్గా లేదని ఆయన అన్నారు.
పోలింగ్ రోజున మధ్యాహ్నం 3 గంటల వరకూ గంట గంటకూ పోలింగ్ శాతం వివరాలు ఇచ్చిన అధికారులు.. సాయంత్రం 5 నుంచి 6 గంటల నడుమ జరిగిన పోలింగ్ శాతం వెల్లడించడానికి అర్ధరాత్రి దాకా ఎందుకు పట్టిందో చెప్పాలని బండి డిమాండ్ చేశారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు జరిగిన పోలింగ్‌ను టీఆర్ఎస్ ఓ పథకం ప్రకారం పెంచిందని ఆరోపించారు. సీఎస్, డీజీపీ, మాజీ డీజీపీ, ఇద్దరు ఐఏఎస్ అధికారులు స్కెచ్ వేసి, జీహెచ్ఎంసీ ఆఫీసులో అర్ధరాత్రి కూర్చుని టీఆర్ఎస్కు అనుకూలంగా పోలింగ్ శాతాన్ని మార్చారని విమర్శించారు. ఎంపిక చేసుకున్న డివిజన్లలో టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు రిగ్గింగ్ చేశాయని బండి సంజయ్ ఆరోపించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.