Bathukamma: బుర్జ్ ఖలీఫాపై మెరిసిన తెలంగాణ బతుకమ్మ.. కలర్‌ఫుల్ వీడియో

బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ

Bathukamma on burj Khalifa: బుర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం దేశానికే గర్వకారణమని, ఈ ఘట్టం చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ ప్రదర్శనకు సహకరించిన UAE ప్రభుత్వానికి, బుర్జ్‌ ఖలీఫా నిర్వాహకులకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

  • Share this:
    తెలంగాణలో బతుకమ్మ (Telangana Bathukamma) పండగది ప్రత్యేక స్థానం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటే  ఈ పండగను ప్రతి ఏటా దసరాకు ముందు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికే బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. సాధాణంగా దేవుళ్లను పువ్వులతో పూజిస్తారు. కానీ పువ్వులనే పూజించే ఈ ప్రకృతి పండగను విదేశాల్లోనూ జరుపుకుంటున్నారు. బతుకమ్మను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడంలో తెలంగాన జాగృతి (Telangana Jagruthi) కీలక భూమిక పోషించింది. తాజాగా మరో అడుగు ముందుకేసిన జాగృతి..  తెలంగాణ బతుకమ్మను విశ్వవేదికపై ప్రదర్శించారు. ప్రపంచంలో అతి ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) పై బతుకమ్మ ప్రదర్శన ఏర్పాటు చేశారు. బతుకమ్మ పండుగపై రూపొందించిన మూడు నిముషాలు నిడివిగల వీడియోను శనివారం రాత్రి 9.30కు, తిరిగి 10.30కు రెండు సార్లు ప్రదర్శించారు.

    తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ వీడియోతో పాటు కేసీఆర్ చిత్రపటం,  'జై తెలంగాణ’, ‘జై హింద్‌’నినాదాలను బుర్జ్‌ ఖలీఫా తెరపై తెలుగులో ప్రదర్శించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ  బుర్జ్‌ ఖలీఫా తెరపై కనిపించగానే తెలంగాణ వాసులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఈ వీడియోను యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు బతుకమ్మ వీడియోను వీక్షించారు.

    Telangana : దేశంలో మిన‌ప‌ప్పు కొర‌త ఉంది.. పండించండి కొంటాం: మంత్రి



    బుర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం దేశానికే గర్వకారణమని, ఈ ఘట్టం చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ ప్రదర్శనకు సహకరించిన UAE ప్రభుత్వానికి, బుర్జ్‌ ఖలీఫా నిర్వాహకులకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక తెలంగాణ జాగృతి రూపొందించిన అల్లిపూల వెన్నెల.. బతుకమ్మ పాటకు ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహ్మాన్ సంగీతం అందించారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించారు. ఇంత పాటను రూపొందించినందున వీరిద్దరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్సీ కవిత.

    Huzurabad Bypoll: ఔను.. రేవంత్‌ను కలిశా.. తప్పేంటి? మంత్రి కేటీఆర్‌‌కు ఈటల కౌంటర్

    బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ వీడియో ప్రదర్శన కార్యక్రమంలో కవితతో పాటు ఎంపీ సురేశ్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్యేలు షకీల్‌ అహ్మద్, జీవన్‌రెడ్డి, జాజుల సురేందర్, డాక్టర్‌ సంజయ్, బిగాల గణేష్‌ గుప్తా, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్‌ సాగర్, దాస్యం విజయ్‌ భాస్కర్, యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొన్నారు. అత్యంత ఎత్తైన కట్టడంపై బతుకమ్మ అందాన్ని చూసి పులకించిపోయారు.
    Published by:Shiva Kumar Addula
    First published: