తెలంగాణ బంద్‌లో తెగిన వేలు... ఏం జరిగిందంటే...

Telangana Bandh : తెలంగాణ ఆర్టీసీ బంద్ ఉద్ధృతంగా సాగుతోంది. అక్కడక్కడా ఉద్రిక్తతలు విషాదాలకూ దారితీస్తున్నాయి.

news18-telugu
Updated: October 19, 2019, 1:52 PM IST
తెలంగాణ బంద్‌లో తెగిన వేలు... ఏం జరిగిందంటే...
తెలంగాణ బంద్‌లో తెగిన వేలు...
  • Share this:
Telangana Bandh : తెలంగాణ బంద్ సందర్భంగా... ఆయా జిల్లాల్లో ఎక్కడికక్కడ పోలీసులు... ఆందోళనలు చేస్తున్న నేతలు, కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు. ఆ క్రమంలో... హైదరాబాద్... ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో నిరసన చేస్తున్న సీపీఐఎంఎల్ నేత పోటు రంగారావు చేతి బొటన వేలు తెగి పోయింది. అది చూసిన వాళ్లంతా షాక్ అయ్యారు. అరే అదేంటి వేలు తెగిపోయింది... అయ్యయ్యో రక్తం కారిపోతోందే అని అందరూ ఆందోళన చెందారు. ఇది ఎలా జరిగిందంటే... ఆందోళన చేస్తున్న ఆయన్ను... పోలీసులు వ్యాన్‌లో ఎక్కించే క్రమంలో రెండు తలుపులు మూసేస్తుంటే... అదే సమయంలో... ఆయన చెయ్యి బయటకు ఉండిపోయింది. ఆ చెయ్యిని లోపలికి తీసుకునే క్షణాల్లో... అప్పటికే డోర్ మూసుకుపోవడంతో... బొటనవేలు బయటకు ఉండిపోయి కట్ అయ్యింది. కావాలనే పోలీసులు ఇలా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "సీఎం కేసీఆర్ నన్ను చంపమన్నారా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు, ఇప్పుడు కార్మికుల పక్షాన నిలబడి పోరాడినందుకు ఇది నాకు బహుమనమా" అని పోలీసులను పోటు రంగారావు ప్రశ్నించారు. పోలీసులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ బంద్‌లో ఇలాంటి ఘటన జరగడం అక్కడున్న వారందర్నీ కలచివేసింది.


Photos : సింగర్ షిర్లీ సెషియా క్యూట్ అందాలు...ఇవి కూడా చదవండి :


డోర్ డెలివరీ ఇక డ్రోన్ డెలివరీ... గూగుల్ కొత్త ప్రాజెక్ట్ గ్రేట్ సక్సెస్...

లిఫ్ట్‌లో ఇరుక్కొని చిన్నారి మృతి... తీవ్ర విషాదంలో తల్లిదండ్రులు

పెళ్లికొడుకును వెతకలేకపోయిన మాట్రిమోనీ ఏజెన్సీ... ఏ శిక్ష పడిందంటే...ప్రపంచంలో అత్యంత సైలెంట్ ప్లేస్ ఏది?... వైరల్ వీడియో

Health Tips : కొబ్బరి నీళ్లతో 20 రకాల ప్రయోజనాలు... తాగితే రోగాలు దరిచేరవు
Published by: Krishna Kumar N
First published: October 19, 2019, 1:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading