Black Fungus: బ్లాక్ ఫంగస్‌కు ఆయుర్వేద చికిత్స.. ఏ మందులు? ఎప్పుడు వేసుకోవాలి?

ప్రతీకాత్మక చిత్రం

ఆయుర్వేద మందుల ద్వారా బ్లాక్ ఫంగస్ కేసుల్లో ప్రాణనష్టం జరగకుండా కాపాడవచ్చని ఆయుష్ డైరెక్టర్ అన్నారు. తెలంగాణలో చాలా మంది ఈఎన్జీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. వారికి ప్రభుత్వం ఆయుర్వేద మందులను ఇస్తున్నట్లు ఆమె చెప్పారు

  • Share this:
    కరోనాతో అల్లకల్లోలమైన మన దేశాన్ని ఇప్పుడు బ్లాక్ ఫంగస్ (మ్యుకోర్ మైకోసిస్) వ్యాధి కూడా కలవరపెడుతోంది. కోవిడ్ నుంచి కోలుకున్న బాధితులకు ఎక్కుగా ఈ ఇన్‌ఫెక్షన్ బారినపడుతున్నారు. బ్లాక్ ఫంగస్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. బాధితులపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. బ్లాక్ ఫంగస్‌లో ఉపయోగించే మందుల కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఐతే బ్లాక్ ఫంగస్‌కు ఆయుదర్వేదంలో అద్భుతమైన చికిత్స ఉందని తెలంగాణ ఆయుష్ శాఖ తెలిపింది. ఆయుర్వేద మందులతో బ్లాక్ ఫంగస్‌ను నయం చేయవచ్చని ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ అలుగు వర్షిణి చెప్పారు.

    బుధవారం ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో మాట్లాడిన ఆమె.. బ్లాక్ ఫంగస్ వంటి లక్షణాలు ఉన్న జబ్బులకు 500 ఏళ్లుగా ఆయుర్వేద చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆయుర్వేద మందుల ద్వారా బ్లాక్ ఫంగస్ కేసుల్లో ప్రాణనష్టం జరగకుండా కాపాడవచ్చని అన్నారు. తెలంగాణలో చాలా మంది ఈఎన్జీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. వారికి ప్రభుత్వం ఆయుర్వేద మందులను ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. బ్లాక్‌ఫంగస్‌కు అల్లోపతి మందులు ఇప్పటికే తీసుకుంటున్నవారు కూడా... ఎలాంటి అపోహలు లేకుండా ఆయుర్వేద మందులు వాడవచ్చని సూచించారు. బ్లాక్ ఫంగస్‌ నివారణకు వాడాల్సిన మందులు, చికిత్సా విధానాన్ని రెండు రకాలుగా వివరించారు.


    మొదటి విధానం:

    1.గంధక రసాయనం- 500 మిల్లీగ్రాములు రోజుకు మూడుసార్లు భోజనం తర్వాత వేసుకోవాలి.
    2. వొకిషాదివటి -250 మిల్లీగ్రాములు రోజుకు రెండుసార్లు భోజనానికి ముందువేసుకోవాలి.
    3. వసంత కుసుమాకర రస్‌- 125 మిల్లీగ్రాములు రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.
    4. శుభ్ర భస్మ- 500 మిల్లీగ్రాముల చూర్ణాన్ని 50 మిల్లీలీటర్ల నీటిలో కలుపుకొని పుక్కిలించాలి.

    రెండో విధానం:
    1. నారదీయ లక్ష్మీ విలాసరస్‌- 500 మిల్లీగ్రాములు రోజుకు రెండుసార్లు భోజనం తర్వాత తీసుకోవాలి.
    2. కైషోర గుగ్గులు- రోజుకు మూడుసార్లు భోజనం తర్వాత 500 మిల్లీగ్రాంలు తీసుకోవాలి.
    3. సుదర్శన ఘన వటి- 500 మిల్లీగ్రాములు రోజుకు రెండుసార్లు భోజనానికి ముందు తీసుకోవాలి.
    4. నిషా ఆమ్లకి- 500 మిల్లీగ్రాములు రోజుకు మూడుసార్లు భోజనానికి ముందు తీసుకోవాలి.

    రెండింటిలో ఏదో ఒక విధానాన్ని అనుసరించాలి. ఈ మందులు అన్ని ఆయుర్వేద షాపుల్లోనూ దొరుకుతాయని ఆయుష్ డైరెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ఉచితంగానే తీసుకురాబోతోందని వెల్లడించారు. ఐతే ఆయుర్వేద మందులను ఎలా పడితే అలా వాడకూడదు. ఆయుష్ వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి.
    Published by:Shiva Kumar Addula
    First published: