Home /News /telangana /

TELANGANA ASSEMBLY WILL BE DISSOLVED EARLY ELECTIONS MAY HAPPEN TPCC LEADER UTTAM KUMAR REDDY SENSATIONAL COMMENTS SK

Telangana: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. మరో 6 నెలల్లోనే అసెంబ్లీ రద్దు.. సీనియర్ నేత సంచలనం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana Politics: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఆరు నెలల్లో అసెంబ్లీని రద్దవుతుందని జోస్యం చెప్పారు.

  తెలంగాణలో ముందస్తు ఎన్నికలు (Telangana) జరుగుతాయని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ అగ్ర నేతలకు ఈ సంకేతాలు ముందే వెళ్లాయని..అందుకే తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తున్నారని.. ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమని జోస్యం చెప్పారు. రాబోయే ఆరు నెలల్లోనే తెలంగాణ అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందని...ఆ తర్వాత ఎన్నికలు జరగవచ్చని  తెలిపారు.  గురువారం  సూర్యాపేట జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. నేరేడుచర్ల మండలంలోని పెంచికల్‌దిన్నె, కల్లూరు, దాసారం, యల్లారం, ముకుందాపురం, బురుగులతండా, సోమారం, చిల్లేపల్లి, బొడలదిన్నె, జగనతండా గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..  2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

  KTR: జూబ్లిహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

  ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, పింఛన్లను అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె ప్రగతి పూర్తిగా విఫలమైందని ఉత్తమ్ కుమార్ విమర్శించారు. గతంలో చేసిన పనుల బిల్లులు ఇప్పటి వరకూ రాకపోవడంతో సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారని.. సర్పంచ్‌లను ఇబ్బంది పెట్టే విధంగా ఈ కార్యక్రమం ఉందని ఆయన ధ్వజమెత్తారు. పల్లె ప్రగతి కార్యక్రమాలకు వెళ్లేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్న ఆయన.. అధికారంలోకి రాగానే రైతులతో పాటు కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేల రైతు బంధు ఇస్తామని చెప్పారు. భూమిలేని రైతు కూలీలకు, జాబ్‌కార్డులున్న ఉపాధి హామీ కూలీలకు ఉపాధి పనులు కల్పిస్తామని తెలిపారు. అంతేకాదు ఏడాదికి ఒక్కొక్కరికి రూ.12వేల చొప్పున నగదు సాయం చేస్తామని పేర్కొన్నారు. కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చేలా చొరవ తీసుకుంటామని చెప్పారు. అలాగే రైతులకు పంట బీమాతో పాటు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు ఉత్తమ్. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే అభయాస్తం పథకాన్ని పునరుద్ధరిస్తామని.. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలిచ్చి, బకాయిలను చెల్లిస్తామన్నారు.

  BJP| Raghunandan Rao: తెలంగాణ బీజేపీలో రఘునందన్ ఒంటరి పోరాటం చేస్తున్నారా

  కాగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణలో మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకు ముందు పలువురు నేతలు కూడా ముందస్తు ఎన్నికలపై కామెంట్స్ చేశారు. మరోవైపు టీఆర్ఎస్ వర్గాలు మాత్రం.. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని అంటున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Telangana, TS Congress, Uttam Kumar Reddy

  తదుపరి వార్తలు