ఓ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కన్నీళ్లు పెట్టున్నారు. అక్కడ ప్లే చేసిన పాట విని భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లిని గుర్తుచేసుకుని ఉద్వేగానికి గురయ్యారు. వివరాలు.. సోమవారం అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా "అపురూపమైనదమ్మ ఆడజన్మ.." సాంగ్‌ను ప్లే చేయగా.. పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన తల్లి పాపమ్మను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. 102 ఏళ్ల వయసులో తన తల్లి మరణించారని, ఆమె ఇచ్చిన స్ఫూర్తితోనే తాను ప్రజాసేవకు అంకితమయ్యానని తెలిపారు. తన విజయాల్లో భార్య పుష్పమ్మ పాత్ర కూడా ఎంతో ఉందని స్పీకర్ అన్నారు.
ఇక, కామారెడ్డి జిల్లాకేంద్రంలోని సత్యగార్డెన్స్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహళా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని అన్నారు. ల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో అమ్మాయిల వివాహాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని చెప్పారు. ప్రతి ఒక్క మహిళకు ఆయన మహిళా దినోత్సవ శభాకాంక్షలు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kamareddy, Pocharam Srinivas Reddy, Telangana, Womens day 2021