ఓటరు జాబితాలో గుత్తా జ్వాల పేరు గల్లంతు

Live Updates Telangana Assembly poll 2018 | ఓటరు జాబితాలో తన పేరు గల్లంతు కావడం పట్ల విస్మయం వ్యక్తంచేసిన గుత్తా జ్వాల..ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నట్లు ఎలా భావించగలమని ప్రశ్నించారు.

news18-telugu
Updated: December 7, 2018, 10:26 AM IST
ఓటరు జాబితాలో గుత్తా జ్వాల పేరు గల్లంతు
గుత్తా జ్వాల (Getty Images)
news18-telugu
Updated: December 7, 2018, 10:26 AM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఓటరు జాబితాలో ఆమె పేరు గల్లంతయ్యింది. ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఆమె ఆశ నెరవేరలేదు. ఉదయాన్నే ఆమె ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు. అ తర్వాత కొద్దిసేపటికే ఓటరు జాబితాలో తన ఓటు గల్లంతుకావడం పట్ల విస్మయం వ్యక్తంచేస్తూ మరో ట్వీట్ చేశారు. ఆన్‌లైన్‌లో చెక్ చేస్తే తన ఓటరు జాబితాలో తన పేరు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. ఓటరు జాబితా నుంచి పేర్లు అనుమానాస్పదంగా గల్లంతైతే ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నట్లు ఎలా భావించగలమంటూ ప్రశ్నించారు.First published: December 7, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...