హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana assembly : రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు.. కీలక అంశాలపై చర్చ

Telangana assembly : రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు.. కీలక అంశాలపై చర్చ

తెలంగాణ అసెంబ్లీ (ఫైల్ ఫోటో)

తెలంగాణ అసెంబ్లీ (ఫైల్ ఫోటో)

Telangana assembly : తెలంగాణ శాసనసభ (Telangana assembly) సమావేశాలు శుక్రవారం(friday) నుంచి నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకోసం ఇప్ప‌టికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభ, మండలి.. అక్టోబర్‌ 1 వరకు కొనసాగే అవకాశముంది.

ఇంకా చదవండి ...

శాసన సభ సమావేశాలు (Telangana assembly) శుక్రవారం నుండి కొనసాగనున్నాయి. ఈ సమావేశాలు రేపటి నుండి వారం రోజుల పాటు కొనసాగున్నాయి.అయితే సభ జరిగే తేదీలు, ఎజెండా తదితరాలపై శుక్రవారం జరిగే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీలో నిర్ణయిస్తారు. శని, ఆది వారాల్లో విరామం తర్వాత తిరిగి ఈ నెల 27 నుంచి వరుసగా ఐదు రోజుల పాటు సభలు సాగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాగా ప్రొటెమ్‌ చైర్మన్‌ హోదాలో ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి(MLC Bhupal reddy) తొలిసారి మండలి సమావేశాలను నిర్వహించనున్నారు.

పలు బిల్లులు ఆర్డీనెన్స్‌లకు ఆమోదం

కాగా అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ‘దళితబంధు’కు(Dalita bandu) చట్టబద్ద‌త కల్పించే బిల్లుతో పాటు మరో ఏడు బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.వీటితో పాటు మరి

కొన్ని ఆర్డినెన్స్‌లకు చట్టబద్ధ్దత కల్పించే బిల్లులు కూడా ఇందులో ఉన్నట్లు తెలిసింది. వరి ధాన్యం కొనుగోలు, నదీ జలాల వివాదం, దళితబంధు పథకం, ఉద్యోగాల భర్తీ, సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన వంటి అంశాలు సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశముంది.

ఇది చదవండి : మరోసారి సీఎం కేసీఆర్ ఢిల్లీకి.. రెండు రోజుల పాటు మకాం.. !


కొవిడ్ నిబంధనలు సడలింపు..

ఇక అసెంబ్లీ సమావేశాలను కోవిడ్‌(covid) నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. గతంలో మాదిరిగానే పోలీస్, మీడియా, అధికారులు, శాసనసభ, మండలి సభ్యుల వెంట వచ్చే సహాయ సిబ్బందిని పరిమిత సంఖ్యలో అనుమతించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు కోవిడ్‌ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్న గత నిబంధనను పాక్షికంగా సడలించారు. ఇక ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు అనుమానం ఉంటే పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా అసెంబ్లీ ఆవరణలో (assembly premises)కరోనా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు వ్యాక్సినేషన్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి అవసరమైన వారికి తొలి, రెండో దశ కోవిడ్‌ టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు.

అసెంబ్లీ ప‌రిస‌రాల్లో ఆంక్ష‌లు

తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతున్న నేపధ్యంలో అసెంబ్లీ పరిసరాల్లోని 4 కి.మీ. పరిదిలో సభలు, సమావేశాలు, ఊరేగింపులను నిషేధించినట్టు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో జరిగే చర్చలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని ఈ నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం ఉదయం 6గంటల నుంచి అమ‌ల్లోకి వ‌చ్చే ఈ నిషేదాజ్ఞలు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ముగిసే వరకూ వర్తిస్తాయని ఆయన తెలిపారు.

ఇది చదవండి : మహారాష్ట్రలో ఘోరం.. మైనర్ బాలికపై 29 మంది అత్యాచారం.. బ్లాక్‌మెయిల్ చేసి 9 నెలలుగా..


ప్రతిపక్షాల వ్యూహాలు..

అయితే ఇటివల జరిగిన సైదాబాద్ అత్యాచారంతో పాటు డ్రగ్స్ వ్యవహారం , ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెరుగుదలతోపాటు ఏపీ, తెలంగాణ నీటి వివాదాలపై చర్చించేందుకు ప్రతిపక్షాలు డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వారం పాటు జరిగే సమావేశాలు గతం కంటే భిన్నంగా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

First published:

Tags: Telangana, Telangana Assembly

ఉత్తమ కథలు