ఓటు వేసేందుకు సొంతూళ్లకు తరలివెళ్తున్న జనం

సొంతూళ్లకు వెళ్లేవారికి బస్సులు, రైళ్లు పెద్ద పరీక్షే పెడుతున్నాయి. తెలంగాణ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ సుమారు ఆర్టీసీ బస్సుల్ని ఎంగేజ్ చేసుకుంది. దీంతో మిగతా బస్సుల్నే ప్రయాణికుల కోసం నడిపిస్తోంది ఆర్టీసీ.

news18-telugu
Updated: December 6, 2018, 4:48 PM IST
ఓటు వేసేందుకు సొంతూళ్లకు తరలివెళ్తున్న జనం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇప్పుడు తెలంగాణ అంతటా ఎన్నికల పండుగ. వరుసగా మూడు రోజులు సెలవులొచ్చిన పండుగ ఇది. ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డ వాళ్లంతా ఇప్పుడు సొంతూళ్లకు వెళ్తున్నారు. శుక్రవారం పోలింగ్, ఆ తర్వాత రెండో శనివారం, ఆదివారం... వరుసగా మూడు రోజులు సెలవులు కలసిరావడంతో ఓటేసి ఓ రెండు రోజులు సొంతూళ్లో గడపాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో స్థిరపడ్డవాళ్లు సైతం ఓటు వేసేందుకు సొంతూళ్లకు వస్తుండటం విశేషం.

సొంతూళ్లకు వెళ్లేవారికి బస్సులు, రైళ్లు పెద్ద పరీక్షే పెడుతున్నాయి. తెలంగాణ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ సుమారు ఆర్టీసీ బస్సుల్ని ఎంగేజ్ చేసుకుంది. దీంతో మిగతా బస్సుల్నే ప్రయాణికుల కోసం నడిపిస్తోంది ఆర్టీసీ. మరోవైపు ఏపీఎస్‌ఆర్‌టీసీ కూడా విజయవాడ-హైదరాబాద్‌ మధ్య 100 ప్రత్యేక బస్సుల్ని నడుపుతోంది. రద్దీ పెరగడంతో ఆర్టీసీ బస్సులు చాలట్లేదు. ఎంజీబీఎస్, జేబీఎస్‌తో పాటు జిల్లాల్లోని ప్రధాన బస్‌స్టేషన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. రైళ్లూ అంతే. దీంతో జనం ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకతప్పని పరిస్థితి.

ఇవి కూడా చదవండి:

తెలంగాణ ఎన్నికలు: తొలి ఓటర్లకు సువర్ణావకాశంఓటు వేస్తున్నారా? ఈవీఎం గురించి ఆసక్తికర విషయాలు

Telangana Elections 2018: ఎన్నికల సిరా చరిత్ర తెలుసా?
First published: December 6, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>