హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Budget : ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు.. 2.56 లక్షల కోట్లతో బడ్జెట్

Telangana Budget : ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు.. 2.56 లక్షల కోట్లతో బడ్జెట్

బడ్జెట్ ప్రతులను స్పీకర్ కు అందిస్తున్న మంత్రి హరీష్ రావు

బడ్జెట్ ప్రతులను స్పీకర్ కు అందిస్తున్న మంత్రి హరీష్ రావు

Telangana Budget : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా జాతీయ గీతం ఆలాపన చేశారు.. అనంతరం మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా జాతీయ గీత ఆలాపన చేసిన అనంతరం మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.  అనంతరం బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్టు ఆయన ప్రకటించారు. కాగా రెండు లక్షల 56 వేల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇందులో రెవెన్యు వ్యయం లక్ష 89 కోట్లు కాగా క్యాపిటల్ వ్యయం 29,728 కోట్లుగా వివరించారు.

అంతకు ముందు రాష్ట్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న సంద‌ర్భంగా ఫిల్మ్ న‌గ‌ర్ వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అక్క‌డ్నుంచి నేరుగా అసెంబ్లీకి బ‌యల్దేరారు. అనంతరం బడ్జెట్ ప్రతులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి అందించారు

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, మండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిలు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా బడ్జెట్‌కు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. శాఖలవారీగా బడ్జెట్‌ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏకగ్రీంగా ఆమోదించింది.


మూడోసారి బడ్జెట్

కాగా మంత్రి హరీశ్‌రావుకు ఇది మూడో బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. టీఆర్‌ఎస్‌ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక 2019-20లో బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆర్థికమంత్రిగా హరీశ్‌రావు 2020-21 నుంచి వార్షిక బడ్జెట్‌ను సభకు సమర్పిస్తున్నారు.

First published:

Tags: Harish Rao, Telangana Budget 2022

ఉత్తమ కథలు