తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేది ఎప్పుడు?

Telangana Assembly Budget Session 2020 : అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచీ నిర్వహించాలనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఏమీ తేల్చుకోలేకపోతోందా? ఎందుకీ పరిస్థితి?

news18-telugu
Updated: February 21, 2020, 6:42 AM IST
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేది ఎప్పుడు?
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేది ఎప్పుడు?
  • Share this:
Telangana Assembly Budget Session 2020 : తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉన్న సమయంలో... రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి అవసరమైన కీలక బడ్జెట్‌ను ఎప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనే అంశంపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. అసెంబ్లీ సమావేశాల్ని ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడు ముగించాలి అనే అంశం ఇప్పుడు కీలకంగా మారింది. అసెంబ్లీ సెక్రటేరియట్ ఆల్రెడీ కొన్ని తేదీలను ప్రభుత్వానికి పతిపాదనలుగా పంపింది. ఈ నెల 16న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ తేదీలపై చర్చించారు. చివరిగా మరోసారి పరిశీలించి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్నాక అధికారిక ప్రకటన రానుంది. ప్రధానంగా పట్టణ ప్రగతి కార్యక్రమం ముగిసిన తర్వాతే సమావేశాల్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడంతో అసెంబ్లీని ఎప్పుడు స్టార్ట్ చెయ్యాలన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

పట్టణ ప్రగతి కార్యక్రమం ఈనెల 24న ప్రారంభమై మార్చి 4న ముగుస్తుంది. అంటే ఇంది మొత్తం 10 రోజులు ఉంటుంది. ఇందులో ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలి. అందువల్ల ఎమ్మెల్యేలు ఆ 10 రోజులూ అసెంబ్లీకి రాలేరు. పట్టణ ప్రగతి కార్యక్రమం తర్వాత అసెబ్లీ సమావేశాలు మొదలవుతాయి. ఓ లెక్క ప్రకారం... మార్చి 6న శుక్రవారం నాడు మొదలవుతాయని తెలిసింది. అంటే శుక్రవారం రెండు సభల్నీ కలిపి... గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. శనివారం... గవర్నర్ ప్రసంగాన్ని గుర్తుచేసుకొని ధన్యవాదాలు చెబుతారు. ఆ తర్వాత ఆదివారం సెలవు. సోమవారం హోలీ కాబట్టి అప్పుడూ సెలవే. అందువల్ల మంగళవారం మళ్లీ అసెంబ్లీ తెరచుకుంటుంది. మంగళ, బుధవారం కూడా గవర్నర్ ప్రసంగంపై చర్చిస్తారని తెలిసింది. అలా అయితే... గురువారం అంటే 12న తేదీ నాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్సుంది.

బడ్జెట్‌ను చదివేందుకు, అర్థం చేసుకునేందుకు నెక్ట్స్ డే ఛాన్స్ ఇస్తారు. అంటే శుక్రవారం సెలవు ఉంటుంది. ఆ తర్వాత శని, ఆదివారం కూడా సెలవే కాబట్టి... సోమవారం నుంచీ బడ్జెట్‌పై చర్చ మొదలవుతుంది. చివరికి బడ్జెట్‌ను ఆమోదింపజేసుకొని సభలను నిరవధికంగా వాయిదా వేయనుంది ప్రభుత్వం. ఈ ప్రతిపాదనా తేదీలను ప్రభుత్వం ఫైనల్ చేస్తుందా లేక మార్చుకుంటుందా అన్నది తేలాల్సి ఉంది. సీఎం కేసీఆర్ ఏం చెబుతారా, ఏ డేట్స్ ఫిక్స్ చేస్తారా అని ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు త్వరగా ముగిసిపోతే... ఆ తర్వాత ప్రజా సమస్యలపై దృష్టి సారించవచ్చని అనుకుంటున్నారు.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు