Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మార్చి6 నుంచి ప్రారంభం

బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజున రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక, మార్చి 8వ తేదీన అసెంబ్లీలో ఆర్థిక శాఖమంత్రి తన్నీర హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

news18-telugu
Updated: February 23, 2020, 10:19 PM IST
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మార్చి6 నుంచి ప్రారంభం
అసెంబ్లీ (ఫైల్ చిత్రం)
  • Share this:
తెలంగాణ రాష్ట్ర శాసనసభ 2020 వార్షిక బడ్జెట్ సమావేశాలు మార్చి 6వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రెండు వారాలపాటు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజున రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక, మార్చి 8వ తేదీన అసెంబ్లీలో ఆర్థిక శాఖమంత్రి తన్నీర హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసన సభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అదే బడ్జెట్ ను కౌన్సిల్ లో ప్రవేశపెట్టనున్నారు. మొదటిరోజు శాసనసభ, శాసనమండలి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. ఆ మరుసటి రోజు శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభిస్తారు. ఆ మరుసటి రోజు ఆదివారం, సోమవారం (హోళి) సెలవు దినాలు కావడంతో సభ తిరిగి మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. మంగళ, బుధవారాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ముగించి గురువారం కావడంతో సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్‌ను అధ్యయనం చేయడానికి ఒక రోజు సభకు విరామం ఇస్తారు. శనివారం, ఆదివారం రెండు రోజులు సభకు సెలవు దినాలు కావడంతో తిరిగి సోమవారం నుంచి బడ్జెట్ పద్దులపై చర్చను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందిన అనంతరం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడుతాయి. శాసనసభ ప్రారంభం, బడ్జెట్ ప్రవేశ పెట్టడం, ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం, సభ నిర్వహించే పని దినాలపై (12 లేక 16) ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

సీఎం నిర్ణయం తీసుకున్న తర్వాత శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై స్పష్టత రానుంది. సీఎఎ బిల్లుపై రాష్ట్ర అసెంబ్లీ స్పష్టత నివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ సమాశాల్లో సిఎఎ వ్యతిరేక బిల్లును అసెంబ్లీ అమోదించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే సిఎఎ వ్యతిరేకించిన విషయం తెలిసిందే.

First published: February 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు