TELANGANA ALERT FOR TELANGANA PEOPLE GOVT EXTENDED COVID 19 RESTRICTION IN STATE KNOW DETAILS EVK
Telangana: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. రాష్ట్రంలో ఆంక్షల పొడగింపు ఎప్పటి వరకంటే?
telangana omicron
Covid 19 Restrictions | దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆయా రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ర్యాలీలు, సభలు, సమావేశాలపై నిషేధం ఉంది. తాజాగా కేసుల పెరుగుదలో ఆంక్షలను జనవరి 10, 2022 వరకు పొడిగిస్తున్నట్టు రాష్ట్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రకటించారు.
Covid 19 Restrictions | దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆయా రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ర్యాలీలు, సభలు, సమావేశాలపై నిషేధం ఉంది. తాజాగా కేసుల పెరుగుదలో ఆంక్షలను జనవరి 10, 2022 వరకు పొడిగిస్తున్నట్టు రాష్ట్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రకటించారు. జనం ఎక్కువగా గుమికూడా రాజకీయ, మతపరమైన కార్యక్రమాలపై అధికారులు దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. దుకాణాల్లో, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పని సరి అని స్పష్టం చేశారు. మాస్క్ లేని వారికి రూ.1,000 జరిమానా విధించాలని అధికారులకు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మళ్లీ ఆంక్షల చట్రం మొదలైందా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
తెలంగాణాలో రోజు రోజుకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 79 అయ్యింది. విదేశాల నుంచి వచ్చే వారికి ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. శనివారం ఒక్క రోజే ఢిల్లీలో ఓమిక్రాన్ (Omicron) సంఖ్య 351కి పెరిగింది. 31 కొత్త ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలో అత్యధికంగా ఓమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. అంతకుముందు నూతన సంవత్సరం సందర్భంగా, ముఖ్యమంత్రి అర వింద్ కేజ్రీవాల్ దేశ రాజధానిలోని ప్రజలను ఇంట్లోనే ఉండాలని, కేసుల సంఖ్య పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని COVID- తగిన ప్రవర్తనను అనుసరించాలని కోరారు.
ఢిల్లీలో 51శాతం పెరుగుదల
దేశంలో కరోనా (Corona) కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కారణంగా మళ్లీ ఇబ్బందికర పరిస్థితిలోకి వెళ్లిపోతుంది. ఢిల్లీ (Delhi) ఒక్క శనివారం 2,716 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల తీవ్రత శుక్రవారం కంటే 51% ఎక్కువ. దీంతో ఢిల్లీలో పాజిటివిటీ రేటు 3.64శాతానికి చేరుకుంది. అంతే కాకుండా కరోనాతో ఒకరు మృతి చెందారు. డిసెంబర్ 31, 2021న 2.44 శాతం పాజిటివ్ రేటుతో 1,796 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య ఢిల్లీలో 14,50,927 కు పెరిగింది. మరణాల సంఖ్య 25,108కి చేరుకుంది.
ఒమిక్రాన్ సోకిన వారిలో ఎక్కువగా గుర్తించిన లక్షణాలు
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి నిర్దిష్ట లక్షణాలంటూ ప్రత్యేకంగా లేవు.
- డెల్టా వలె, ఓమిక్రాన్ సోకిన వారిలో కొందరిలో లక్షణాలు బయటపడడం లేదు.
- వేరియంట్ సోకినవారికి కండరాల నొప్పితో పాటు 1-2 రోజులు అలసిపోయినట్లు అనిపిస్తుంది.
- గొంతు నొప్పి, తలనొప్పి మరియు ఛాతీ నొప్పి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి తలనొప్పి, శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
- వ్యాక్సిన్ తీసుకోని వారు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.