రబీకి యూరియాను సిద్ధం చేయండి.. అధికారులకు మంత్రి ఆదేశం

సోమవారం అధికారులతో వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రబీకి కూడా యూరియా నిల్వలు సిద్ధం చేయాలని.. ఎరువుల అంచనాలపై కేంద్రానికి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

news18-telugu
Updated: September 9, 2019, 5:37 PM IST
రబీకి యూరియాను సిద్ధం చేయండి.. అధికారులకు మంత్రి ఆదేశం
అధికారులతో మంత్రి నిరంజన్ సమీక్ష
  • Share this:
తెలంగాణలో యూరియా కొరతపై రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. క్యూలైన్‌లో నిలబడి ఓ రైతులు చనిపోయినా, యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో యూరియా కొరతను తీర్చేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. యూరియా కొరత లేకుండా చూడాలని ఇప్పటికే మంత్రులు, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇక సోమవారం అధికారులతో వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రబీకి కూడా యూరియా నిల్వలు సిద్ధం చేయాలని.. ఎరువుల అంచనాలపై కేంద్రానికి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

గంగవరం, వైజాగ్, ట్యుటికోరిన్, కాకినాడ, కరైకల్, కృష్ణపట్నం పోర్టులతో పాటు హజీరా (గుజరాత్) క్రిబ్ కో యూనిట్, మద్రాస్ ఫర్టిలైజర్స్ (చెన్నై) నుంచి తెలంగాణకు చేరుకుంటున్న యూరియా వివరాలపై అధికారులను ఆరా తీశారు మంత్రి నిరంజన్. అన్ని జిల్లాలకు చేరుకున్న యూరియా నిల్వలు, రబీ సాగు వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆదేశించారు. ఇక ఈ నెల 11న ఢిల్లీలో జరగనున్న కేంద్ర ప్రభుత్వ సమావేశంలో రబీకి అవసరమయిన ఎరువుల అంచనాలపై నివేదిక అందజేయాలని సూచించారు. యూరియా సరఫరా త్వరితగతిన సాగేందుకు పోర్టు ఇంఛార్జ్, రైల్వే ఇంఛార్జ్‌లతో సంప్రదింపులు జరపాలన్నారు నిరంజన్ రెడ్డి.

సెప్టెంబరులో రోడ్డు, రైలు మార్గాల ద్వారా చేరుకున్న 64,485 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు చేరుకుందని ఆయన అన్నారు. మరో 33,205 మెట్రిక్ టన్నుల యూరియా రవాణాలో ఉందని.. పలు పోర్టుల్లో 7,800 మెట్రిక్ టన్నులు లోడ్ అవుతోందని చెప్పారు. హాకాభవన్‌లో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్దసారధి, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు, అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ హాజరయ్యారు.

First published: September 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు