Home /News /telangana /

TELANGANA ADVOCATES PROTEST AGAINST PROPOSAL OF SHIFT HIGH COURT BA

తెలంగాణ హైకోర్టు వివాదం.. పేపర్లు తగలబెట్టిన న్యాయవాదులు

telangana advocates protest against proposal of shift high court

telangana advocates protest against proposal of shift high court

తెలంగాణ హైకోర్టు తరలిస్తే మరో తెలంగాణ ఉద్యమం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. హైకోర్టు తరలిస్తే రాష్ట వ్యాప్తంగా అన్ని కోర్టులలో విధులను మొత్తం స్తంభింపజేస్తామన్నారు.

  తెలంగాణ హైకోర్టు ను బుద్వేల్‌కు తరలించాలన్న ప్రభుత్వం ప్రతిపాదనను న్యాయవాదులు తప్పుపట్టారు. ప్రభుత్వం తయారు చేసిన ప్రతివాదనల పేపర్ల ను దగ్దం చేసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టు తరలింపు పై రెండో రోజు హైకోర్టు వద్ద న్యాయవాదులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన హైకోర్టు ను తరలిస్తే ఉరుకోబోమని న్యాయవాదులు హెచ్చరించారు. హైకోర్టు తరలింపు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హైకోర్టు తరలిస్తే మరో తెలంగాణ ఉద్యమం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. హైకోర్టు తరలిస్తే రాష్ట వ్యాప్తంగా అన్ని కోర్టులలో విధులను మొత్తం స్తంభింపజేస్తామన్నారు. అన్ని ప్రతి పక్ష పార్టీ లను కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని న్యాయవాదులు ప్రకటించారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Telangana, Telangana High Court

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు