Home /News /telangana /

TELANGANA ACADEMIC CALENDAR RELEASED HERE ARE FULL DETAILS OF HOLIDAYS SCHOOL TIMINGS PCV

Telangana : తెలంగాణ అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. సెలవులు ఇవే!

Telangana Academic Calendar 2022 23

Telangana Academic Calendar 2022 23

తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఎదురుచూస్తున్న ప్రకటనను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ ను పాఠశాల విభాగం విడుదల చేసింది.

    Telangana : తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఎదురుచూస్తున్న ప్రకటనను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ ను పాఠశాల విభాగం విడుదల చేసింది.

    ఇవీ స్కూల్ టైమింగ్స్

    ప్రైమరీ స్కూళ్లు ఉదయం 9 గంటలు ప్రారంభం కావాలి. సాయంత్రం నాలుగు గంటల లోపు విద్యాబోధన, శారీరక, ఐచ్చిక అంశాల బోధన పూర్తిచేయాలి.

    ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 గంటలకు మొదలు కావాలి. సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు పనిచేయాల్సి ఉంటుంది.

    పదో తరగతి వరకు ఉండే హైస్కూళ్లు ఉదయం 9గంటలకు ప్రారంభం కావాలి. సాయంత్రం 4గంటల 45 నిమిషాల వరకు కొనసాగవచ్చు.



    పండుగ సెలవుల వివరాలు ఇవీ

    పండుగలు, సెలవులకు సంబంధించిన వివరాలతో అకడమిక్ ఇయర్ క్యాలెండర్ ను తెలంగాణ పాఠశాల విభాగం పొందుపరిచింది.

    దసరా సెలవులు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 10 వరకు ఉంటాయి. అంటే.. ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు 16 రోజులు సెలవులు రానున్నాయి.

    క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు కొనసాగనున్నాయి.

    సంక్రాంతి సెలవులు జనవరి 13 నుంచి జనవరి 17 వరకు ఉండబోతున్నాయి.

    వచ్చే ఏడాది ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు సమ్మర్ హాలీడేస్ ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది.

    ఈ అకడిమిక్ ఇయర్ కు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు సిలబస్ ను పూర్తిచేసి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని ప్రభుత్వం సూచించింది.
    Published by:V. Parameshawara Chary
    First published:

    Tags: Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు