హోమ్ /వార్తలు /తెలంగాణ /

Aasara pensions: అర్హులు గాలిలో... అనర్హులు పల్లకిలో... ఆసరా పింఛన్లలో భారీగా అవకతవకలు

Aasara pensions: అర్హులు గాలిలో... అనర్హులు పల్లకిలో... ఆసరా పింఛన్లలో భారీగా అవకతవకలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Aasara Pensions: మున్సిపాలిటీల్లో చాలా మేరకు పింఛన్ల దరఖాస్తులు పక్కన పెట్టినట్లు సమాచారం. మున్సిపాలిటీలలో నెలకొన్న వర్గ పోరు వల్ల ఆసరా పింఛన్లలో అర్హులకు పూర్తిగా అన్యాయం జరిగినట్టు తెలుస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Khammam

  (జి. శ్రీనివాసరెడ్డి,  న్యూస్ 18  ఖమ్మం ప్రతినిధి)

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) ఎంతో ప్రతిష్టాత్మకంగా మంజూరు చేసిన ఆసరా పింఛన్లలో (Aasara Pensions) కొన్నిచోట్ల అవకతవకలు జరుగుతున్నాయి. అర్హులకు ఇవ్వకుండా.. అనర్హులకు నెలనెలా డబ్బులు ఇస్తున్నారు. ఇలాంటి అక్రమాల వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరు గారే ప్రమాదం లేకపోలేదు. ప్రభుత్వం రూ. వేల కోట్లను ఆసరా పింఛన్ల కొరకు కేటాయిస్తున్నప్పటికి అవి వృధా అయ్యే పరిస్థితి నెలకొంది. అసలు పింఛన్ల మంజూరులో ప్రభుత్వ నిబంధనల మేరకు చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హులను గాలిలో... అనర్హులను పల్లకిలో ఉంచారనే విమర్శలు బలంగా వస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకే ఇంట్లో ఒక్కరికే పింఛన్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని కొన్ని మున్సిపాలిటీలల్లో మాత్రం భిన్నంగా ఒకే ఇంట్లో భార్య,భర్తలకు మంజూరు చేసినట్టు సమాచారం. పింఛన్లను ఆన్ లైన్ చేసిన వాటిని మార్చి.. కొంతమందికి అనుకూలంగా ఉన్న వారివే ఉంచి.. మిగిలినవి తొలగించినట్లు స్పష్టమవుతుంది.

  ప్రభుత్వ, సింగరేణి ఫించన్లు తీసుకుంటున్న వారికి సైతం ఆసరా పెన్షన్స్ మంజూరు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకే ఇంట్లో భార్య, భర్తలకు పెన్షన్ల విషయంలో అధికారుల పర్యవేక్షణ కొరవడినట్లు స్పష్టమవుతుంది. అంతేకాకుండా కొందరు ప్రజాప్రతినిధులు పింఛన్ల కొరకు దరఖాస్తు చేసుకున్న అనర్హుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి.. మంజూరు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ మాజీ కౌన్సిలర్ భర్త గత సంవత్సరం క్రితం మృతి చెందిన క్రమంలో ఆసరా పింఛన్ కొరకు దరఖాస్తు చేసుకోగా కావాలనే మంజూరు చేయనట్లు తెలుస్తుంది. అదేవిధంగా మున్సిపాలిటీలో ప్రధాన హోదాలో ఉన్న ఓ ప్రజాప్రతినిధికి అనుకూలంగా ఉన్న కౌన్సిలర్లకు ఎక్కువగా, వ్యతిరేకంగా ఉన్న కౌన్సిలర్లకు తక్కువగా పెన్షన్లు మంజూరు చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా పింఛన్ల విషయంలో సైతం అనుకూలం, వ్యతిరేకమనే తారతమ్యంగా వ్యవహరించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

  అధికారులు, ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదనేది స్పష్టమవుతుంది. మున్సిపాలిటీల్లో చాలా మేరకు పింఛన్ల దరఖాస్తులు పక్కన పెట్టినట్లు సమాచారం. మున్సిపాలిటీలలో నెలకొన్న వర్గ పోరు వల్ల ఆసరా పింఛన్లలో అర్హులకు పూర్తిగా అన్యాయం జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు చొరవ చూపి ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలలో పింఛన్లలో జరిగిన అవకతవకలపై విచారణ నిర్వహించి బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అర్హులైన అందరికీ పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Khammam, Telangana

  ఉత్తమ కథలు