వృద్ధాప్యంలో ఏ ఆసరా లేని వారి కోసమే తెలంగాణ ప్రభుత్వం (Telangana) ఆసరా పెన్షన్లు (Asaraa Pensions) ఇస్తోంది. గతంలో 60 ఏళ్లు పైబడిన వారికి పింఛన్‌లు ఇవ్వగా ఇప్పుడు... 57 ఏళ్లు నిండిన వారికి కూడా అందిస్తోంది. కానీ ఈ ఆసరా పెన్షన్లు పక్కదారి పడుతున్నాయి. అనర్హులకు కూడా డబ్బులు అందుతున్నాయి. కొన్ని చోట్ల నిండా 50 ఏళ్లు లేని వారికి పెన్షన్‌లు (Telangana Pensions) అందుతుననాయి ఇంకొన్ని చోట్ల 65 ఏళ్ల దాటిన వారికి కూడా ఇవ్వవడం లేదు. నారాయణపేట (Narayanpet)లో 50 ఏళ్లు కూడా లేని వ్యక్తికి ఆసరా పెన్షన్ ఇస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అనర్హుడికి పింఛను మంజూరవడంపై నారాయణ పేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి (Rajender Reddy) ఆగ్రహం వ్యక్త చేశారు. ఆసరా పింఛను పొందేందుకు సరిపడా వయసులేని వ్యక్తిని లబ్ధిదారుడిగా ఎంపిక చేయడం ఏంటని అధికారులపై మండిపడ్డారు.
శనివారం నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో కొత్తగా మంజూరు అయిన పింఛను ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆసరా పెన్షన్ సర్టిఫికెట్లను పంపిణీ చేస్తున్న సమయంలో మరికల్‌కు చెందిన మల్లేశ్ అనే వ్యక్తి కూడా అక్కడికి వచ్చారు. అతడిని చూసి ఎమ్మెల్యే ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తిని చూస్తే.. 50వేలు కూడా లేవని ... ఇట్టే అర్థమైపోతుంది. ఎమ్మెల్యేకు కూడా అదే డౌట్ వచ్చింది. 50 ఏళ్లు కూడా లేని నీకు వృద్ధాప్య పింఛను ఎలా మంజూరు అయింది?" అని ఆరా తీశారు. అతడి ఉన్న ఆధార్ కార్డును పరిశీలించగా.. దానిపై 61 సంవత్సరాల వయసు అని ఉంది. ఇంచుమించు 42 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తికి... ఆధార్ కార్డుపై 61 సంవత్సరాలు నమోదవడం ఏంటని..? అని అధికారులను నిలదీశారు.
ఆధార్ కార్డు (Aadhaar Card)లో వయసు తప్పుగా నమోదు కావడం... క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించకుండానే... అనర్హుడికి ఆసరా పింఛను మంజూరు చేయడంపై ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సీరియస్ అయ్యారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. ఆధార్ కార్డులు, దరఖాస్తుదారుల వాస్తవ వయసును క్షేత్రస్థాయిలో పరిశీలించి.. అర్హులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. కాగా, తెలంగాణలో ఆగస్టు 15 నుంచి 57 ఏళ్ల వయసుపైడిన వారికి కూడా ఆసరా పింఛన్ ఇస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నెల నెలా రూ.2,016 ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aasara pension, Narayanpet, Telangana