ప్రస్తుతం పరీక్షా కాలం నడుస్తోంది. టెన్త్ నుంచి డిగ్రీ వరకు విద్యార్థులందరికీ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షల్లో కొందరు విద్యార్థులు వింత వింత సమాధానాలు రాస్తుంటారు. ఆన్సర్ తెలియకున్నా.. తమకు నచ్చినట్లుగా పేపర్ నింపేస్తుంటారు. కొందరుతై ప్రశ్ననే.. సమాధానంగా మళ్లీ మళ్లీ రాస్తుంటారు. ఈ మధ్య పశ్చిమ బెంగాల్లో ఓ విద్యార్థి ఆన్సర్ పేపర్లో.. పుష్ఫ డైలాగ్ రాస్తే.. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎగ్జామ్ పేపర్లో ఆన్సర్‌కు బదులు పుష్ప డైలాగ్‌లు రాశాడు. టెన్త్ పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానాలు రాయకుండా.. ''పుష్ప..పుష్పరాజ్.. అపున్ లిఖేగా నహీ (రాసేదే లేదు)''.. అని రాశాడు. ఆ ఆన్సర్ షీట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి తెలంగాణలో జరిగింది.
Rahul Gandhi | OU: మే7న ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ గాంధీ -6న వరంగల్‌లో కాంగ్రెస్ సభ
ఎమ్మెల్యే ఎన్నికలను ఎలా నిర్వహిస్తారు? అనే ప్రశ్నలకు ఓ విద్యార్థి వెరైటీ సమాధానం రాశాడు. పైసలిస్తరు.. మందు పోస్తరు.. బిర్యానీ పెడ్తరు.. ఎన్నికల్లో గిదే జరుగుతుందని సమాధానంలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డి గూడ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి.. ప్రశ్నాపత్రంలో వచ్చిన ఓ ప్రశ్నలకు ఇలా సమాధానం రాశాడు.
TS EAMCET 2022: టీఎస్ ఎంసెట్ దరఖాస్తుకు 4 రోజులే చాన్స్.. ఇప్పటి వరకు వచ్చిన దరఖా
ప్రశ్న: ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతాయి?
విద్యార్థి సమాధానం: ఎమ్మెల్యే ఇంటింటికీ వచ్చి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని అడుగుతారు. ప్రచారం చేస్తారు. 18 సంవత్సరాలు ఉన్న వారికి ఓటు హక్కు ఉంటుంది. వాళ్లకు పైసలు ఇస్తారు. బిర్యానీలు, మందు బాటిల్స్, ఆడవారికి చీరలు పంచుతారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేను ప్రజలు ఎన్నుకుంటారు. ప్రభుత్వ ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో లెక్క చేస్తుంది. ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని గెలిచినట్లు ప్రకటిస్తారు.
కొందరు నెటిజన్లు విద్యార్థి రాసిన సమాధానాన్ని సమర్థిస్తున్నారు. సమాజంలో ఇదే జరుగుతోంది.. కదా అందుకనే అలా రాశాడని అంటున్నారు. పుస్తకాల్లో ఉన్నది ఎవరికి కావాలి? ప్రాక్టికల్‌గా తనకు తెలిసిన దాన్నే.. అతడు రాశాడని పేర్కొంటున్నారు. ఓట్ల కోసం రాజకీయాలు ఎంత నీచ స్థితికి దిగజారుతున్నాయో? వాటి ప్రభావం పిల్లలపై ఎలా ఉందో.. దీనిని బట్టి తెలుస్తోంది. ఐతే ఈ సమాధానానికి టీచర్ 4 మార్కులు వేయడం విశేషం. మారిన విద్యా విధానం ప్రకారం.. విద్యార్థి సృజనాత్మకతకు ఎన్నో కొన్ని మార్కులు వేయాల్సిందేనని.. అందుకనే 4 మార్కులు వేసినట్లు సదరు ఉపాధ్యాయుడు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.