జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. జోగులాంబ గద్వాల జిల్లా ధర్మవరం సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై లారీని తప్పించబోయిన ఓ కారు ప్రమాదానికి గురైంది. అవతలి వైపు నుంచి వస్తున్న బొలేరో వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో దంపతులు మురళీ మోహన్ రెడ్డి, సుజాతతో పాటు వారి కుమార్తె నేహా రెడ్డి (13), కుమారుడు సూర్యతేజ ఉన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించారు.
అయితే మార్గమధ్యలో సుజాత, మురళీమోహన్‌రెడ్డి, నేహా మృతిచెందారు. ఇక, సూర్యతేజ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీకి చెందినవారిగా తెలుస్తోంది. ఇక, కోదండపురం ఎస్సై కృష్ణయ్య ఘటనాస్థలిని పరిశీలించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక, ఈ ప్రమాదంలో కారు నుజ్జనుజ్జు అయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.