Home /News /telangana /

TELANGANA 110 YEAR OLD MAN BEATS COVID IN GANDHI HOSPITAL VB

Gandhi Hospital: గాంధీలో అద్భుతం.. దేశంలో ఇదే ప్రథమం.. 110 ఏళ్ల వృద్ధుడు..

కరోనాను జయించిన 110 ఏళ్ల వృద్ధుడు

కరోనాను జయించిన 110 ఏళ్ల వృద్ధుడు

Gandhi Hospital: కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరిపై విరుచుకుపడుతోంది. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా మారింది. కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా అంతకు అంత పెరుగుతున్నాయి. అయితే కోవిడ్ బారిన పడిన ఓ శతాధిక వృద్ధుడు (110) కరోనా నుంచి కోలుకుని అందరిలో మానసిక స్థైర్యాన్ని నింపుతున్నాడు.

ఇంకా చదవండి ...
    కరోనా మహమ్మారి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లకు సోకితే చాలా ప్రమాదకరమని వైద్యుల చెబుతూ వస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు. వృద్దుల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. అందుకే వారు కరోనాకు జాగ్రత్తగా ఉండాలి. కాని మానసికంగా దైర్యంగా ఉంటే కరోనాను జయించవచ్చు అంటూ 110 ఏళ్ల వ్యక్తి నిరూపించాడు. కీసరలోని ఓ ఆశ్రమంలో ఉంటున్న రామానంద తీర్థ అనే వ్యక్తి కరోనా సోకి గాంధీ ఆస్పత్రిలో ఏప్రిల్ 24 న చేరాడు. అతడు ఆసుపత్రిలో 18 రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం ఆయన వైరస్‌ నుంచి బయటపడ్డారని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం. రాజారావు వెల్లడించారు. తన వయస్సు 110 ఏళ్లని తెలిపారని.. అంత వయస్సున్న వ్యక్తి కరోనా నుంచి కోలుకోవడం దేశంలో ఇదే ప్రథమమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నప్పటికీ, ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగయ్యేవరకు ప్రత్యేక వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి తర్వాత డిశ్ఛార్జి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడ్డట్లుగా వైద్యులు ప్రకటించారు.

    ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లుగా వైద్యులు ప్రకటించిన నేపథ్యంలో దేశంలోనే అరుదైన వ్యక్తిగా ఈయన నిలిచాడు. గతంలో ప్రవచనకర్తగా పనిచేశారన్నారు. గాంధీ ఆసుపత్రి యాజమాన్యం విడుదల చేసిన వీడియోలో రామానందతీర్థ మంచంలో పడుకొని వైద్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతుండం చూడొచ్చని తెలిపారు. కొన్నేళ్ల క్రితం లెగ్ సర్జరీ కోసం గాంధీ ఆసుపత్రికి వచ్చానని చెప్పారు. రామానంద తీర్థకు ఎలాంటి ఇతర జబ్బులు లేకపోవడం వల్లే ఆయన కరోనాను జయించగలిగాడని గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

    తీర్థ దాదాపు రెండు దశాబ్దాలు హిమాలయాలలో నివసించినట్లు వారు చెబుతారు. కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాలు ప్రకారం మార్చి 2021 నాటికి కోవిడ్ తో మరణించిన వారిలో 88 శాతం 45 కంటె ఎక్కువ వయస్సు వారే ఉన్నారని తెలిపినట్లు అన్నారు. వారితో పోల్చితే 65 ఏళ్ల వయస్సు ఉన్న వారు కూడా కోలు కుంటున్నట్లు.. ఇంది మంచి పరిణామమని ఆయన పేర్కొన్నారు. గాంధీ వైద్య సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు
    Published by:Veera Babu
    First published:

    Tags: 110 YEAR OLD MAN, HYDERABAD GANDHI HOSPITAL, RECORD OF GANDHI HOSPITAL, RECOVERED, Treatment

    తదుపరి వార్తలు