Telangana: పాము కాటేస్తే.. కోడి పొడిచిందనుకున్నాడు.. చివరకు ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న ఓ 10 ఏళ్ల బాలుడిని పాము కాటేసింది.. అయితే అతడు తనను కొడి పొడిచిందనుకుని అపోహపడ్డాడు.

  • Share this:
    స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న ఓ 10 ఏళ్ల బాలుడిని పాము కాటేసింది.. అయితే అతడు తనను కొడి పొడిచిందనుకుని అపోహపడ్డాడు. పాము కాటేసిన చోట పసుపు రాసుకుని తిరిగి స్నేహితులతో ఆడుకోవడం ప్రారంభించాడు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే కిందపడిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. జిల్లాలోని కేసముద్రం మండలం బేరువాడ గ్రామానికి చెందిన ముదిగిరి రమేష్, శ్రీలత దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు ముదిగిరి అజయ్(10) బుధవారం స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. ఈ క్రమంలోనే ఇంటిపక్కనే ఉన్న పాత భవనంలోకి స్నేహితులతో కలిసి వెళ్లాడు. అందులో సెల్ప్‌పై ఓ కోడి పొదిగి ఉంది. అయితే అక్కడే ఓ పాము కూడా కనిపించకుండా ఉంది.

    అయితే ఇదేమీ తెలియని అజయ్, అతని స్నేహితులు ఇంట్లో ఆడుకుంటున్నారు. ఇంతలో కోడి పొదిగిన సెల్ఫ్‌ను అందుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే పాము అజయ్ చేతిపై కాటేసింది. అయితే తనను కోడి పొడిచి ఉంటుందని అనుకున్న అజయ్.. ఇంటికి వెళ్లి అక్కడ పసుపు వేసుకున్నాడు. తిరిగి స్నేహితులతో కలిసి ఆడుకోవడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికే పరిస్థితి విషమించడంతో.. అజయ్ కిందపడిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అజయ్‌ను మానుకోట ఆస్పత్రికి తరలించారు.

    ఇవి చదవండి: Telangana: పుట్టింటికి వెళ్లిన భార్య.. జాగ్రత్తగా చూసుకుంటానని తీసుకొచ్చిన భర్త.. కానీ చివరకు..

    Crime News: మహిళ దారుణ హత్య.. రెండు రోజులకు భర్త అరెస్ట్.. అసలేం జరిగిందంటే..

    అజయ్‌ను పరీక్షించిన వైద్యులు పాము కరిచినట్టుగా గుర్తించారు. అతనికి చికిత్స ప్రారంభించారు. అయితే పరిస్థితి విషమించడంతో.. బుధవారం రాత్రి అజయ్ మృతిచెందాడు. దీంతో అజయ్‌ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అజయ్ మృతితో తల్లిదండ్రులు రమేశ్, శ్రీలతలు కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఈ ఘటన స్థానికంగా ఉన్నవారిని కూడా కలిచివేసింది.
    Published by:Sumanth Kanukula
    First published: