ఈ నేపథ్యంలోనే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీటి దొంగ అయితే..నేటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి గజదొంగలా మారాడని విమర్శించారు.
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రిష్ణా నదీపై రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ విస్తరణ చేపడుతుంది. మరోవైపు తెలంగాణ సైతం ఏపీ ప్రాజెక్టులకు చెక్ పెట్టేందుకు వ్యుహాలను సిద్దం చేస్తోంది.ఈ క్రమంలోనే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపి ప్రభుత్వ ముఖ్యమంత్రిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆనాడు పొతిరెడ్డి పాడు ద్వార నీటిని దొంగతనంగా తరలించుకుపోయి నీటి దోంగగా మారడని..ప్రస్థుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం అనుమతి లేని ప్రాజెక్టులను నిర్మిస్తూ... గజదొంగగా మారడని మండిపడ్డారు.. ఆంధ్రనాయకుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
తెలంగాణలోని మహబుబ్‌నగర్, ఖమ్మం ,రంగారెడ్డి ,నల్గొండ, హైదరాబాద్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఏపి ప్రభుత్వ ప్రయత్నాలను ఎండగట్టాలని ఆయన సూచించారు. వాళ్లకు అనుమతి లేని ప్రాజెక్టులను దొంగతనంగా నిర్మిస్తున్నారని చెప్పారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలను ముఖ్యమంత్రి కేసిఆర్ తెప్పించారని త్వరలో గ్రీన్ ట్రిబ్యునల్‌కు పిర్యాదు చేస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ప్రాజెక్టులను ఆపకపోతే తీవ్రమైన పోరాటం చేస్తామని హెచ్చరించారు. దీంతోపాటు ఆంధ్రా ప్రజలందరు తెలంగాణకు వ్యతిరేకులని ,లంకలో పుట్టిన వారంతా రాక్షసులేనని వ్యాఖ్యానించారు.
మరోవైపు, మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆంధ్రా ప్రజలను మంత్రి లంక వాసులతో పోల్చడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎప్పుడో జరగాల్సిన ఆర్‌డీఎస్ కుడి కాలువ పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కృష్ణ, గోదావరి ట్రిబ్యునల్ నుండి ఇష్టం వచ్చినట్టి నీటిని చౌర్యానికి పాల్పడుతుందని కర్నూలు టీడీపీ నేతలు ఆరోపించారు. తమకు రావాల్సిన 4 టీఎంసీల నీటి వాటా ప్రకారం టెండర్ వేసి కుడి కాలువ పనులు జరుగుతున్నాయని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Minister prashanth reddy