Home /News /telangana /

TELANAGANA HIGH COURT SERIOUS ON SCHOOLS REOPEN WITHOUT ANY GUIDELINES VRY

Highcourt on Schools : స్కూలుకు వెళ్లడం మన ఇష్టం...కుదిరితే ఆఫ్‌లైన్..లేదంటే ఆన్‌లైన్..?

Highcourt on Schools : స్కూలుకు వెళ్లడం మన ఇష్టం...కుదిరితే ఆఫ్‌లైన్..లేదంటే ఆన్‌లైన్..?

Highcourt on Schools : స్కూలుకు వెళ్లడం మన ఇష్టం...కుదిరితే ఆఫ్‌లైన్..లేదంటే ఆన్‌లైన్..?

Hyderabad : జులై నుండి అన్ని విద్యావ్యవస్థలు ప్రారంభం కానున్న క్రమంలో రాష్ట్ర హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.. గైడ్‌లైన్స్ లేకుండా ప్రారంభిస్తామని ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించింది. దీంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు కోర్టుకు హజరై వివరణ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
జులై ఒకటి నుండి అన్ని రకాల విద్యా సంస్థలను ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే..దీంతో పదవతరగతిలోపు పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఓవైపు కొవిడ్ మూడో వేవ్, రెండు లేదా మూడు వారాల్లో విజృంభించనుందని నిపుణులు చెబుతుంటే...తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటీ గైడ్ లైన్స్ లేకుండానే స్కూళ్లను ప్రారంభిస్తామని ప్రకటించింది.

అయితే ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో విచారణ జరిగింది..దీంతో రాష్ట్ర ప్రభుత్వ హడావిడి నిర్ణయంపై హైకోర్టు ఆసంతృప్తిని వ్యక్తం చేసింది..కోవిడ్ తరుణంలో స్కూళ్లు ఓపెన్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది..ఇక స్కూళ్లు ఏ ప్రాతిపదికన ఓపెన్ చేస్తున్నారని నిలదీసింది. ఇందుకు సంబంధించిన గైడ్‌లైన్స్ ఎమైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించింది. ఇంతా హడావుడిగా స్కూళ్లు ఎందుకు అంటూ.. అభ్యంతరం వ్యక్తం చేసింది.

విద్యార్థుల ఫిజికల్ అటెండెన్స్‌పై కోర్టుకు కొన్ని సందేహాలు ఉన్నాయని చెప్పింది.. ఈనేపథ్యంలోనే విద్యాశాఖ ఉన్నతాధికారులు హజరుకావాలంటూ కోర్టు ఆదేశించింది.. అత్యవసరంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హజరయ్యారు. అనంతరం ఆయన విద్యార్థుల ఫిజికల్ హజరుపై స్పష్టత ఇచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఇష్టానుసారమే హజరు ఉంటుందని వివరించారు. వారి అనుమతితోనే ఆఫ్‌లైన్‌ క్లాస్‌కు హజరుకావచ్చని చెప్పారు. లేదంటే ఆన్‌లైన్ ద్వారా కూడా అవకాశం ఉంటుందని అన్నారు. గత సంవత్సరం కూడా ఇలాంటీ నిబంధనలు ఉన్నాయని.. ఇందుకు సంబంధించి విధివిధానాలను రూపోందించి ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు.

దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటీ గైడ్‌లైన్స్ లేకుండా స్కూళ్ల రీ ఒపెనింగ్ ఉత్తర్వులు జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వారం రోజుల్లో పూర్తి స్థాయి విధివిధానాలను రూపోదించి కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారి చేసింది. మరోసారి జులై 7న విచారణ వాయిదా వేసింది.

అయితే ఒకే స్కూళ్లో ఆఫ్‌లైన్ , ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది..కొంతమంది పిల్లలకు ఆఫ్‌లైన్‌లో మరి కొంతమంది పిల్లలకు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించడం పాఠశాలలకు కష్టతరంగానే ఉంటుంది...మరోవైపు ప్రస్తుత స్కూళ్లలో ఇరుకు గదులు ఉండడం, ఒకే క్లాసులో సుమారు 40 మందికి పైగా విద్యార్థులు ఉండడం లాంటీ పరిస్థితులు ఉన్నాయి..ఇలాంటీ పరిస్థితుల్లో తమ పిల్లలను బడికి పంపడంపై 90 శాతానికి పైగా తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు పిటిషనర్ తరుఫు న్యాయవాది తెలిపారు.
Published by:yveerash yveerash
First published:

Tags: Schools reopening, Telangana High Court

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు