TelanganaElections: పోలింగ్‌కు సర్వం సిద్ధం..ఓటేద్దాం రండి

Telanagana assembly elections 2018 | తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 1821 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 2.80 కోట్లు ఓటర్లు ఉన్నారు. వారిలో 1.41 కోటి మంది పురుషులు కాగా, 1.39 కోటి మంది మహిళలు, 2,691 మంది ఇతరులు ఉన్నారు.

news18-telugu
Updated: December 6, 2018, 9:38 PM IST
TelanganaElections: పోలింగ్‌కు సర్వం సిద్ధం..ఓటేద్దాం రండి
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: December 6, 2018, 9:38 PM IST
తెలంగాణలో అసలైన ఓట్ల పండగ మొదలైంది. మరికొద్ది గంటల్లోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. సామాగ్రి, సిబ్బంది పోలింగ్ కేంద్రాలుకు చేరారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మకమైన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. అటు రాష్ట్రవ్యాప్తంగా 32,815 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 3873, వనపర్తిలో 280 కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల విధుల కోసం 1,60,509 మంది సిబ్బందిని కేటాయించారు.

ఎన్నికల కోసం 55,329 బ్యాలెట్‌ యూనిట్లు, 42,751 వీవీప్యాట్‌ యంత్రాలు, 39,763 కంట్రోల్‌ యూనిట్లను వినియోగిస్తున్నారు. పోలింగ్ కోసం 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎన్నికల భద్రత కోసం 279 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. వీరితో పాటు 30వేల మంది తెలంగాణ పోలీసులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 18,860 పోలీసులను రాష్ట్రంలో మోహరించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు.

ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం తెలంగాణలో మొత్తం 2.80 కోట్లు ఓటర్లు ఉన్నారు. వారిలో 1.41 కోటి మంది పురుషులు కాగా, 1.39 కోటి మంది మహిళలు, 2,691 మంది ఇతరులు ఉన్నారు. రాష్ట్రంలో 4.57 లక్షల మంది దివ్యాంగ ఓటర్ల ఉన్నారు.వారి కోసం వీల్ ఛైర్లు, బ్రెయిన్ లిపిలో ఎపిక్ కార్డ్‌లు, సైన్ బోర్డులు, ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక రవాణా సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు.

తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 1821 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మల్కాజ్‌గిరిలో అత్యధికంగా 42 మంది పోటీ చేస్తున్నారు. బాన్స్‌వాడలో అత్యల్పంగా ఆరుగురు బరిలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నుంచి 119, బీజేపీ 118, కాంగ్రెస్ 99, టీడీపీ 13, సీపీఐ 3, సీపీఎం 26, ఎన్సీపీ 22, బీఎస్పీ 107, ఎంఐఎం నుంచి 8 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గుర్తింపు ఉన్న పార్టీల నుంచి 515 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా..గుర్తింపు లేని పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులుతో పాటు స్వతంత్రులు 1306 మంది బరిలో ఉన్నారు.



ఇక డిసెంబరు 11న తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.
First published: December 6, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు