Home /News /telangana /

TELANAGANA BJP MLA RAJASING FIRES ON CM KCR ON BORDER ISSUE VRY

Mla Rajasing fires on cm : ఫస్ట్ ట్రీట్మెంట్ తర్వాతే డాక్యుమెంట్స్..సరిహద్దులో మృతులకు బాధ్యులు ఎవరు ?

రాజాసింగ్ (ఫైల్ ఫోటో)

రాజాసింగ్ (ఫైల్ ఫోటో)

Mla Rajasing: తెలంగాణ ఏపీ సరిహద్దుల వద్ద నేడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రోగులు రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా పోలీసులు కఠినంగా వ్వవహరిస్తున్నారు.అయితే ఈ ఆంక్షలపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు.

సరిహద్దుల వద్ద తెలంగాణ ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల ఇద్దరు చనిపోయారని ,ఈ మరణాలకు ఎవరు భాద్యత వహిస్తారని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు.సంక్షోభ సమయంలో ఇలాంటీ ఆంక్షలు పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ హబ్ చెప్పుకుంటున్న నేపథ్యంలోనే ఇక్కడ వైద్యం దొరుకుందనే విశ్వాసం తో పక్కరాష్ట్రాల ప్రజలు వస్తున్నారని కాన విశ్వాసాన్ని వమ్ము చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఇప్పుడు రాజకీయాలక ఫుల్‌స్టాప్ పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడవల్సిన భాద్యత సీఎం కేసిఆర్ పై ఉందని అన్నారు. ఇక ఎన్నికలప్పుడు ఆంధ్ర ప్రజలకోసం గిఫ్టులు పంపిన సీఎం ఇప్పుడు ఎందుకు ఫాంహౌస్‌లో ఉన్నారని అన్నారు. వెంటనే సీఎం కేసిఆర్ ఫాం హౌజ్ నుండి బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్రం మాత్రం కొవిడ్ రోగులు ఎక్కడ నుండైనా చికిత్స పొందవచ్చని చెబుతున్నా సీఎం కేసిఆర్ కు అర్థం కావడం లేదని అన్నారు.

ఆంధ్ర ప్రజలకు సేవ చేసేందుకు ఇది మంచి సమయమని అన్నారు. ఇలాంటీ సమయంలో ఆంక్షల పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సబబు కాదని హితవు కాదన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వారికి ముందుగా ట్రిట్‌మెంట్ చేసి తర్వాతే డాక్యుమెంట్స్ అడగాలని అన్నారు.
Published by:yveerash yveerash
First published:

Tags: Corona, Lockdown, MLA Rajasingh, Telangana

తదుపరి వార్తలు