Home /News /telangana /

TELANAGA GRADUATE MLC RESULTS 2021 PALLA RAJESHWAR REDDY LEADING IN 3RD ROUND WITH 12681 VOTES SK

Telanaga MlC Results: మూడో రౌండ్‌లోనూ పల్లాదే పైచేయి.. రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న

Telangana Graduate MLC elections results 2021: మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్నపై 12,681 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో ఇప్పటి వరకు మూడు రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. మూడు రౌండ్ల కౌంటింగ్ తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి లీడింగ్‌లో ఉన్నారు. వరుసగా మూడు రౌండ్లలోనూ పల్లాదే పైచేయి కనిపిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇప్పటి వరకు 47,545 ఓట్లు పడ్డాయి. రెండో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నిలిచారు. ఆయనకు 34,864,116 ఓట్లు పోలయ్యాయి. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం 29,560 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్నపై 12,681 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    ఫస్ట్ రౌండ్:

    పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్) 16,130
    తీన్మార్ మల్లన్న (ఇండిపెండెంట్) 12,046
    కోదండరామ్ (టీజేఎస్) 9,080
    ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ) 6,615
    రాములు నాయక్ (రాములు నాయక్) 4,345

    రెండో రౌండ్:
    పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్) 15,857
    తీన్మార్ మల్లన్న (ఇండిపెండెంట్) 12,070
    కోదండరామ్ (టీజేఎస్) 9,448
    ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ) 6,669
    రాములు నాయక్ (రాములు నాయక్) 3,244

    మూడో రౌండ్:
    పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్) 15,558
    తీన్మార్ మల్లన్న (ఇండిపెండెంట్) 10,748
    కోదండరామ్ (టీజేఎస్) 11,032
    ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ) 6,615
    రాములు నాయక్ (రాములు నాయక్) 4,355

    నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజక పరిధిలో 71 మంది బరిలో ఉన్నారు. 3,86,320 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు భారీగా ఓట్లు పోలవడంతో పాటు అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో ఫలితాలు మరింతగా ఆలస్యం అయ్యే అవకాశముంది. అటు సిబ్బంది అవగాహన లేమితోనూ కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా కొనసాగుతోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Telangana, Telangana mlc election, Telangana Politics, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు