Home /News /telangana /

TELAGNANA EX MINISTER ETELA RAJENDAR GETTING READY TO DO PADAYATRA IN HUZURABAD CONSTITUENCY TARGETING BY ELECTIONS AK

Telangana: ఈటల సరికొత్త వ్యూహం.. టీఆర్ఎస్ కంటే ముందుగానే రంగంలోకి..

మంత్రి ఈటల రాజేందర్ (ఫైల్)

మంత్రి ఈటల రాజేందర్ (ఫైల్)

Etela Rajendar: హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో తన పట్టు పెంచుకునేందుకు ఇప్పటికీ తనకు నమ్మకమైన వారిని ఆయా ప్రాంతాలపై ఫోకస్ చేయాలని ఈటల రాజేందర్ సూచించారు.

    టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన మాజీమంత్రి ఈటల రాజేందర్ తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌పై పూర్తిస్థాయిలో ఫోకస్ చేస్తున్నారు. త్వరలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఈటల.. మళ్లీ ఉప ఎన్నికల్లో గెలిచి కేసీఆర్‌పై పైచేయి సాధించాలని పట్టుదలగా ఉన్నారు. మరోవైపు హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక వస్తే.. టీఆర్ఎస్ నాయకత్వం కూడా తనను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు ఈటల. అలాంటి పరిస్థితిని ముందుగానే ఊహించిన ఈటల.. ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా.. తన గెలుపు ఖాయమనేలా ఉండాలనే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు.

    ఈ క్రమంలోనే త్వరలోనే ఆయన హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తాన్ని చుట్టేసేలా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. త్వరలోనే నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేపట్టి.. రాబోయే ఉప ఎన్నికలు హుజూరాబాద్ ఆత్మగౌరవానికి పరీక్ష అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారని సమాచారం. ఇందుకోసం ఆయన రూట్ మ్యాప్ కూడా రెడీ చేసుకుంటున్నారని తెలుస్తోంది. బీజేపీలో చేరిన తరువాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హుజూరాబాద్‌లో పాదయాత్ర చేపట్టాలని ఆయన భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

    నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో తన పట్టు పెంచుకునేందుకు ఇప్పటికీ తనకు నమ్మకమైన వారిని ఆయా ప్రాంతాలపై ఫోకస్ చేయాలని ఈటల రాజేందర్ సూచించారు. తన పాదయాత్ర విజయవంతమైతే.. ఉప ఎన్నికల్లో విజయం కూడా కచ్చితంగా సొంతమవుతుందని ఆయన యోచిస్తున్నారు. మొత్తానికి హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌పై పైచేయి సాధించేందుకు ఈటల రాజేందర్ రచిస్తున్న వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Etela rajender, Huzurabad, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు