Home /News /telangana /

TELAGANA PUROHIT MAINTAIN SOCIAL DISTANCE AT WEDDING EVENT HE PERFORM RITUALS BY SITTING IN CAR SK

Telangana: పెళ్లి వేదికపైకి రాను.. కారులో కూర్చునే మంత్రాలు చదివిన పంతులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా భయంతో పురోహితుడు కల్యాణ వేదికపైకి అడుగు పెట్టకుండానే పెళ్లి జరిపించారు. పెళ్లి మంటపం ముందు కారులోనే కూర్చొని.. మైకులో మంత్రాలు చదివారు.

    పెళ్లంటే ఆ సందడి మామూలుగా ఉండదు. శుభలేఖలు మొదలు బరాత్ వరకు ప్రతి ఘట్టమూ ఘనంగా జరుపుతారు. కానీ కరోనా లాక్‌డౌన్ ప్రభావం వివాహాలపై తీవ్రంగా పడింది. ఎలాంటి సందడి లేకుండానే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. 500 నుంచి 1000 మందితో జరిగే వివాహ వేడుకలు ఇప్పుడు 50 మందికి మాత్రమే పరిమితమయ్యాయి. కరోనా సమయంలో పెళ్లిళ్లకు వెళ్లడం అవసరమా? అని చాలా మంది భావిస్తున్నారు. ఎంత దగ్గరి బంధవులైనా వెళ్లడం లేదు. చివరకు పురోహితులు కూడా ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. అందుకే ఎలాంటి హంగూ, ఆర్భాటమూ లేకుండా పెళ్లిళ్లు జరుగుతున్నాయి.

    పెళ్లికి హాజరయ్యే ఖచ్చితంగా మాస్క్ ధరిస్తున్నారు. మంటపంలో శానిటైజర్ అందుబాటులో ఉంచుతున్నారు. ఐతే కరోనా భయంతో పురోహితుడు కల్యాణ వేదికపైకి అడుగు పెట్టకుండానే పెళ్లి జరిపించారు. పెళ్లి మంటపం ముందు కారులోనే కూర్చొని.. మైకులో మంత్రాలు చదివారు. కారు నుంచి అస్సలు బయటకు రాలేదు. మైక్‌లో మంత్రాలు చదివి..మమ అనిపించారు. సిద్దిపేట జిల్లాలో ఈ ఘటన జరిగింది. కరోనా సమయంలో భౌతిక దూరం పాటించేందుు ఇలా చేశానని ఆయన చెప్పారు.

    సిద్దిపేట జిల్లా కోహెడకు చెందిన యువతికి సౌమ్యకు, తంగళ్లపల్లికి చెందిన కృష్ణమూర్తితో వివాహం జరిగింది. కోహెడలో ఆదివారం వివాహ వేడుకలను సాదాసీదాగా నిర్వహించారు. ఐతే పెళ్లి జరిపిచాల్సిన పురోహితుడు ప్రసాద్‌రావు శర్మ మంటపం వరకు కారులో వచ్చారు. కానీ లోపలికి మాత్రం రాలేదు. కారులో కూర్చుని మంత్రాలు చదివి వివాహం తంతును పూర్తి చేశారు. మైక్‌ ద్వారా మంత్రాలు చదివారు. ఆయన చెప్పినట్లుగా చేసి వధువు మెడలో తాళికట్టాడు వరుడు.

    ప్రస్తుతం తెలంగాణలో లాక్‌డౌన్ అమలవుతోంది. మే 12 నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. 10 గంటల తర్వాత వ్యవసాయ పనులు, అత్యసర సేవలు తప్ప దేనికీ అనుమతి లేదు. రోజులో 20 గంటల పాటు కఠినమైన ఆంక్షలు అమలవుతున్నాయి. లాక్‌డౌన్ వేళ పెళ్లిళ్లపైనా ఆంక్షలున్నాయి. 50 మంది కంటే ఎక్కువ మంది హాజరు కాకూడదు. అంత్యక్రియలకు 25 మంది కంటే ఎక్కువ మంది వెళ్లకూడదు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Lockdown, Marriage, Telangana, Wedding

    తదుపరి వార్తలు