హోమ్ /వార్తలు /తెలంగాణ /

Teenmar mallanna : చంచల్‌గూడ జైలుకు తీన్మార్ మల్లన్న ..! 14 రోజుల రిమాండ్

Teenmar mallanna : చంచల్‌గూడ జైలుకు తీన్మార్ మల్లన్న ..! 14 రోజుల రిమాండ్

Teenmar mallanna

Teenmar mallanna

Teenmar mallanna : జర్నలిస్ట్, క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న అలియస్ చింతపండు నవీన్‌ కు 14 రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ విధిస్తూ సికింద్రాబాద్ కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన్ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

  నిన్న రాత్రి అరెస్ట్ చేసిన తీన్మార్ మల్లన్నను నేడు ఉదయం పోలీసులు సికింద్రాబాద్ కోర్టు ముందుకు హజరుపర్చారు. దీంతో కాగా మల్లన్న పై ముప్పై లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డంటూ మారుతీ జ్యోతిష్యాలయం నిర్వాహాకుడు లక్ష్మికాంత శర్మ గతంలోనే చిలకల గూడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లను విచారించిన పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అంతకు ముందే ఆయన కార్యాలయంలో సోదాలు కూడా జరిపారు. ఈ నేపథ్యంలో ఆయనను వర్చువల్ విధానం ద్వారా సికింద్రాబాద్‌ కోర్టు జడ్జి ముందు పోలీసులు ప్రవేశపెట్టారు.

  ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్నను ఏడు రోజుల పాటు కస్టడికి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే ఈ దీనిపై మల్లన్న తరుపున వాదనలు వినిపించిన అడ్వకేట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు పెట్టిన కేసుల ప్రకారం ఎలాంటీ చర్యలు జరగలేదని చెప్పారు. కాగా పోలీసులు పెట్టిన కేసుల ప్రకారం బాధితుడు సూసైడ్ , చోరికి యత్నించారని పోలీసులు కేసును నమోదు చేశారు. దీంతో పాటు 30 లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇరువురి వాదనలు విన్న కోర్టు 14 రోజుల పాటు జుడిషియల్ రిమాండ్‌కు తరలించింది.

  ఇది చదవండి : Bandi sanjay Padayatra : భాగ్యలక్ష్మి టెంపుల్‌లో ప్రత్యేక పూజలు.. పాదయాత్ర షురు..

  కాగా గతంలోనే లక్ష్మికాంత శర్మ ఆశ్రమం పేరుతో అమాయకులను మోసం చేస్తున్నట్టు పలు కథనాలు వెలువడ్డాయి. దీంతో తన ఆశ్రమాన్ని మూసేస్తున్నట్టు కూడా ప్రకటించారు. వరుస కథనాలతో లక్ష్మికాంత శర్మ పీఏ ద్వారా కొన్ని డబ్బులు కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్టు కూడా కథనాలు వెలువడ్డాయి. ఇందుకు సంబందించి వీడీయో పాటు ఆడియో రికార్డులను తీన్మార్ మల్లన్న బయటపెట్టాడు. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య వాగ్వావాదం కూడా చోటు చేసుకుంది. అయితే కేసు పెట్టిన ఆరు నెలల తర్వాత పోలీసులు చర్యలకు ఉపక్రమించడం కొసమెరుపు. మరోవైపు సీఎం కేసిఆర్‌ను టార్గెట్ చేస్తూ తీన్మార్ మల్లన్న విమర్శలు చేస్తుండడంతో ఈయన అరెస్ట్ వెనక రాజకీయ కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో చర్చ కూడా జరుగుతుంది.

  ఇది చదవండి : సెమి ఫైనల్‌లో గెలిచాను.. ఇక సీఎం కేసీఆర్‌తో ఫైనల్ మ్యాచ్...! మల్లారెడ్డి సవాల్‌పై రేవంత్ రెడ్డి

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Police arrest, Teenmar mallanna, Telangana Politics

  ఉత్తమ కథలు