తీన్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీలో చేరారు. దిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్ ఆయనకు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మల్లన్నకు బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేశారు.( Teenmar mallanna joins in bjp ) మల్లన్నతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు మాజీ టీఎస్‌పీసీ సభ్యుడు విఠల్ పార్టీ నేడు బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. కాగా ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్‌లు కూడా పాల్గోన్నారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..''నేను తీసుకున్నది సభ్యత్వ రసీదు కాదు.. 15 మీటర్ల తాడు. ఈ తాడుతో తెలంగాణ అమరవీరుల స్థూపానికి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావును కట్టేస్తా.. అమరవీరుల తల్లిదండ్రులను పిలిచి కొరడాతో కొట్టిస్తా... ప్రపంచంలోనే అత్యంత మోసకారి కేసీఆర్. ( Teenmar mallanna joins in bjp ) ప్రశ్నించే నాటికి నేను ఒక్కడినే. ఇప్పుడు చాలా గొంతుకలు ఉన్నాయి. తాడు తీసుకొచ్చేందుకే నేను ఢిల్లీకి వచ్చానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
cannabis : గంజాయికి అలవాటు పడిన యువకుడు.. నగర నడిబోడ్డున మొక్కల పెంపకం..
దీంతోపాటు నాపై 38 కేసులు పెట్టారని, అయినా.. ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు . ఇక నా అరెస్ట్‌తో పోలీసులు బాధపడ్డారు, జడ్జీలు మదనపడ్డారని అన్నారు.. రాష్ట్రంలోని ఉద్యమకారులంతా ఒక్కటవుతున్నారని చెప్పారు. ప్రజల్లోకి వెళ్లి కేసీఆర్‌పై పోరాడతామని అన్నారు.
అనంతరం తరుణ్ చుగ్ మాట్లాడుతూ..''సమస్యలపై పోరాడే నవీన్ కుమార్‌ను బీజేపీలోకి స్వాగతిస్తున్నాం. దేశంలో మార్పు రావాలంటే కలం ఎత్తాల్సిందే. కేసీఆర్ దోపిడీ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నవీన్ కుమార్ కలం ఎత్తారు. తెలంగాణా యువత తీన్మార్ మల్లన్న లైవ్ కోసం ఎదురు చూస్తుంటారు. ( Teenmar mallanna joins in bjp ) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓట్లు సాధించారు. ప్రజా సమస్యలపై బీజేపీ నేతలు యాత్రలు చేస్తుంటే అధికార పార్టీ దాడులు చేస్తూ, కేసులు పెడుతోంది. ప్రజాధనాన్ని తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోంది.'' అని మండిపడ్డారు.
Warangal : వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి 1100 కోట్లు.. జీవో జారీ
సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుక అని అన్నారు. తెలంగాణలో రాక్షస ప్రభుత్వం, కుటుంబ పాలనను అంతం చేయాలని తీన్మార్ మల్లన్న పోరాడుతున్నారని తెలిపారు. ( Teenmar mallanna joins in bjp ) తెలంగాణ ప్రభుత్వం అక్రమ కేసులతో భయపెట్టాలని చూసిందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులకు బీజేపీ అండగా ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Teenmar mallanna, Telangana bjp