నేటి యువతలో విపరీత ధోరణి ఎక్కువవుతుంది..నిండు నూరేళ్లు కలిసి జీవించాల్సిన వారు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు..ప్రేమించుకునేటప్పుటు లేని భయం పెళ్లి చేసుకునే సమయంలో వ్యక్త పరుస్తున్నారు. అంగీకరిస్తే పెళ్లి, లేదంటే చావు..వాళ్ల టార్గెట్ ఈ రెండింటిపైనే ఉంటుంది.. ప్రేమించినంత సేపు ప్రేమించి పెద్దలను ఎదిరంచలేక చావుకు దగ్గరవుతున్నారు... ఇలా తన ప్రేమికురాలు పెళ్లికి నిరాకరించిందని ఓ ప్రేమికుడు తాను పని చేస్తున్న చోటే ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.
బిహార్ రాష్ట్రం మధువనిలోని బాలువాటోల్ గ్రామానికి చెందిన అమిత్ కుమార్.. వరంగల్ జిల్లాలోని ఘన్‌పూర్‌లోని ఓ రైస్‌మిల్లులో పని చేస్తున్నాడు. అమిత్ తన స్వగ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. రోజూ ఆమెతో ఫోన్ లో మాట్లాడేవాడు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఆమె అమిత్ ఫోన్ ఎత్తడం లేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అమిత్.. అదే ఊర్లో ఉంటున్న తన స్నేహితులను వాకబు చేశాడు. ఆమె మరొకరిని ప్రేమిస్తోందని వారు సమాధానమివ్వడంతో మనోవేదనకు గురయ్యాడు. తనను ప్రేమించిన యువతి మరోకరిని ఇష్టపడడం భరించలేకపోయాడు. కనీసం తన గ్రామానికి వెళ్లి ఆమెతో మాట్లాడలేక కుంగిపోయాడు.. దీంతో గత రాత్రి ఎవరూ లేని సమయంలో మిల్లులోనే ఉరి వేసుకుని తనువు చాలించాడు.ఇక ఉదయం తోటి కార్మికులు గమనించి మిల్లు యజమానికి సమాచారం అందించారు. యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలానికి చేరుకొని శవపరీక్ష కోసం మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lovers suicide, Warangal