తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా తీజ్ బంజారా ఉత్సవాలు...

పెళ్ళికాని యువతులు నెలరోజుల పాటు ఉపావాస దీక్షలతో,నియమ నిష్టలతో ఉండి గోదుమ విత్తనాలను నాటి అవి మొలకెత్తిన తర్వాత అవి తమ తలపై మోస్తూ నాట్యం చేస్తూ ఆటాపాటలతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు.

news18-telugu
Updated: August 23, 2019, 11:17 PM IST
తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా తీజ్ బంజారా ఉత్సవాలు...
ఎమ్మెల్యే రేఖా నాయక్
  • Share this:
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో నేడు బంజారా యువతులు,మహిళలు, లంబాడా తెగకు చెందిన వారు తీజ్ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఉట్నూర్ లో ని జగదాంబ ఆలయం నుండి హెచ్ కె జి ఎన్ ఫంక్షన్ హాల్ వరకు డప్పు చప్పుల్ల మద్య నృత్యాలు చేస్తూ తీజ్ ప్రతిమలు ఎత్తుకొని ర్యాలీ నిర్వహించిన లంబాడి గిరిజనులు. అనంతరం హెచ్ కే జి ఎన్ గార్డెన్ లో తీజ్ ఉత్సవాల కార్యక్రమం నిర్వహించారు లంబాడీ మహిళలు, నాయకులు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎంఎల్ఏ అజ్మీరా రేఖానాయక్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అథితిగా అదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్దన్ హాజరు కాగా..బోథ్ ఎంఎల్ఏ రాథోడ్ బాపురావ్, ఉట్నూర్ జడ్పీటీసీ రాథోడ్ చారులత,పెంబి మండలం జడ్పీటీసీ లు మరియు వివిధ గ్రామాల సర్పంచ్ లు,ఎంపిటిసి లు పాల్గొని సంబరాలను తిలకించారు.

ఈసందర్బంగా ఖానాపూర్ ఎంఎల్ఏ రేఖా నాయక్ మాట్లాడుతూ..తీజ్ ఉత్సవాలు ప్రతిఏటా బంజారా లంబాడా తెగకు చెందిన పెళ్ళికాని యువతులు నెలరోజుల పాటు ఉపావాస దీక్షలతో,నియమ నిష్టలతో ఉండి గోదుమ విత్తనాలను నాటి అవి మొలకెత్తిన తర్వాత అవి తమ తలపై మోస్తూ నాట్యం చేస్తూ ఆటాపాటలతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారన్నారు. తీజ్ ఉత్సవాల గురించి, జగదాంబ ఆలయాలను ఏర్పాటు చేయడానికి నిదులను కేటాయించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందని,త్వరలోనే వాటి ఏర్పాటు తో పాటు బంజారాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు