Teej: బంజారా తండాల్లో ఘనంగా తీజ్ పండగ.. యువతులదే సందడి

ప్రతియేటా శ్రావణ మాసంలో తమ బంజారాలు రాఖీ పౌర్ణమి నుండి కృష్ణాష్టమి వరకు ఈ తీజ్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. తండా అంతట తీజ్ వేడుక సందడి వాతావరణంతో మారుమోగుతుంది.

news18-telugu
Updated: August 13, 2020, 10:40 AM IST
Teej: బంజారా తండాల్లో ఘనంగా తీజ్ పండగ.. యువతులదే సందడి
తీజ్ వేడుకల్లో బంజారా యవతులు
  • Share this:
(కట్టా లెనిన్, న్యూస్ 18 ఆదిలాబాద్ ప్రతినిధి)
ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో బంజారాలు తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. తీజ్ ఉత్సవాల సందర్భంగా బంజారాల మహిళలు యువతులు గోధుమ మొలకల బుట్టలను తీజ్ ప్రతిమలుగా భావిస్తారు. వాటిని ఎత్తుకుని బంజారా సాంప్రదాయ నృత్యాలతో ఆనందంగా సంబురంగా ఆట పాటలతో సందడి చేస్తున్నారు.

తమ సంస్కృతి సాంప్రదాయాలతో రాఖీ పౌర్ణమి మొదలుకొని కృష్ణాష్టమి వరకు ఈ తీజ్ వేడుకలను జరుపుకుంటారు. ముందుగా రాఖీ పౌర్ణమికి ఒకరోజు ముందు బంజారా యువతులు పుట్ట మట్టిని సేకరించి తమ ఇళ్ళలో ఓ బుట్టలో ఉంచి వాటిలో గొధుమ విత్తనాలు చల్లుతారు. అప్పటి నుండి 9 రోజుల పాటు శ్రావణ మాసం సందర్భంగా ఉపవాసాలు ఉంటారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం వేళలో ఈ గోధుమలు అలికిన బుట్టలో నిళ్ళు పోస్తు వాటిని పూజిస్తారు. ఆపై తమ సాంప్రదాయ బంజారా పాటలు పాడుతు నృత్యాలు చేస్తారు.

ప్రతియేటా శ్రావణ మాసంలో తమ బంజారాలు రాఖీ పౌర్ణమి నుండి కృష్ణాష్టమి వరకు ఈ తీజ్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. తండా అంతట తీజ్ వేడుక సందడి వాతావరణంతో మారుమోగుతుంది. తీజ్ వేడుకలు తమ పూర్వకాలం నుండి వస్తున్న సాంప్రదాయ పండుగ అని బంజారాలు తెలుపుతున్నారు. ప్రతి తండాలో తమ నాయక్ ఇంటి ముందు కృష్ణాష్టమి రోజున అందరు తమ గోధుమలతో అలికిన బుట్టలు తీసుకొని వచ్చి వాటికి నీళ్ళు పోసి పూజలు చేసి సాంప్రదాయ నృత్యాలు చేస్తారు.  ఆపై ప్రత్యేకంగా తమ సాంప్రదాయ బద్దంగా "ధంబోలి" అనే కార్యక్రమం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో యువతులంతా కలిసి నానబెట్టిన శనగ విత్తనాలు తీసుకొని హారతితో ఊరి దగ్గరలోని ఓ రేగు చెట్టు వద్దకు వెళ్లి పూజలు చేసి హారతి ఇచ్చి ఈ శనగ విత్తనాలను రేగు చెట్టు ముళ్ళకు గుచ్చుతారు. ఆపై వారంత చివరి మొక్కులు చెల్లించి తిరిగి తీజ్ ప్రతిమల దగ్గర వచ్చి పూజలు చేసి నృత్యాలు చేస్తారు.  మరుసటి రోజు తీజ్ తోడే కార్యక్రమం నాయక్ ఇంటి వద్ద జరుపుతారు. తమకు మంచి భర్తలు దొరకాలని తక కుటుంబాలు బాగుండాలని అందరు గ్రామంలో సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు.  పెద్దల ఆశీస్సులు పొందుతారు. అనంతరం ఈ తీజ్ ప్రతిమలను ఊరి పొలిమెరలోని వాగు లేదా చెరువులో నిమజ్జనం చేస్తారు. ఇలా ప్రతియేటా బంజారాలు తమ సాంప్రదాయ బద్దంగా తీజ్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: August 13, 2020, 10:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading