హోమ్ /వార్తలు /తెలంగాణ /

హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం..!

హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం..!

 మెట్రో రైలు

మెట్రో రైలు

మెట్రో రైలు సాంకేతిక సమస్యతో మధ్యలో ఆగిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.

  హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో బాలానగర్ అంబేద్కర్ స్టేషన్లో ట్రయిన్ నిలిచిపోయింది. మియాపూర్ నుంచి అమీర్‌పేట వెళ్తున్న ట్రెయిన్‌లో కరెంట్ సప్లై లేకపోవడంతో రైలు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లే వాళ్లంతా ట్రయిన్‌లో ఉండటంతో మెట్రో సిబ్బందితో గొడవకు దిగారు. పవర్ సప్లై కారణంగా సమస్య తలెత్తిందని మెట్రో సిబ్బంది చెబుతున్నారు. అయితే ప్రయాణికులు మాత్రం గంట నుంచి ఒక్క మెట్రో ట్రైన్ కూడా రాలేదని ఆరోపిస్తున్నారు.

  విద్యుత్ లైన్లలో పవర్ సప్లై లేక.. సాంకేతిక లోపంతోనే మెట్రో ట్రైన్ నిలిచిపోయినట్లు సమాచారం.అయితే దీనిపై మెట్రో అధికారులు మాత్రం స్పందించడం లేదు. మళ్లీ సర్వీసులు ఎప్పుడు పునరుద్ధరిస్తారన్నదానిపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తమకు టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. గంటా నుంచి వేచి చూస్తున్న రైలు రాకపోవడం ఏంటని మెట్రో సిబ్బందిని ప్రశ్నించారు.

  వేలాది వాహనాలతో నిత్యం రద్దీగా మారిన హైదరాబాాాద్ ప్రజలకు ఊరట కలిగించేందుకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు, అమీర్‌పేట నుంచి మియాపూర్ వరకు మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది. మరోవైపు తాజగా ఎల్బీనగర్ వరకు కూడా మెట్రో రైలు సర్వీసుల్పి ప్రారంభించారు. త్వరలోనే అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రో ట్రైన్ ప్రారంభించేదుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. టికెట్ ధరలు భారమైన... ట్రాఫిక్ నుంచి బతికి బయటపడుతున్నామంటూ అనేకమంది భాగ్యనగరవాసులు మెట్రో ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈనేపథ్యంలో మెట్రో ట్రైన్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల పట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: Brand Hyderabad, Hyderabad, Hyderabad Metro

  ఉత్తమ కథలు