వరంగల్‌కు ఐటీ కంపెనీలు... తెలంగాణ దూసుకుపోతోందన్న కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం ఐటీ శాఖ తరఫున ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటిని తీసుకెళ్లాలన్న ప్రయత్నం విజయవంతమైందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

news18-telugu
Updated: June 20, 2020, 7:37 PM IST
వరంగల్‌కు ఐటీ కంపెనీలు... తెలంగాణ దూసుకుపోతోందన్న కేటీఆర్
మంత్రి కేటీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఐటీ ఎగుమతుల్లో జాతీయ సగటు కన్నా తెలంగాణ ఐటీ రంగం పురోగతి సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. జాతీయ సగటు 8.09 శాతంతో పోల్చితే 17.9 7 శాతంతో తెలంగాణ ఐటీ మరియు ఐటీ సంబంధిత ఎగుమతులు ఉన్నాయని వివరించారు.తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రగతి నివేదికను ఆ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం విడుదల చేశారు. గత ఐదు సంవత్సరాలుగా ప్రగతి నివేదికను విడుదల చేస్తూ వస్తున్నామని తెలిపారు. ఐటీ శాఖ పరిధిలో ఉన్న వివిధ విభాగాలకు సంబంధించిన పురోగతిని ఈ నివేదికలో ఉంచినట్లు కేటీఆర్ వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం ఐటీ శాఖ తరఫున ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటిని తీసుకెళ్లాలన్న ప్రయత్నం విజయవంతమైందని అన్నారు. టెక్ మహీంద్రా, సైయంట్ కంపెనీలు తమ కేంద్రాలను వరంగల్‌లో ఓపెన్ చేసేందుకు ముందుకు వచ్చాయని వ్యాఖ్యానించారు. 2019- 2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఐటీ రంగంలో పలు భారీ పెట్టుబడుల వచ్చాయని తెలిపారు. అమెజాన్ తన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంగణాన్ని, మైక్రాన్ తన అతిపెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించినట్టు కేటీఆర్ వెల్లడించారు.

First published: June 20, 2020, 7:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading