(వీరన్న, మెదక్, న్యూస్ 18)
ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా (Teacher) విధులు నిర్వహిస్తూనే కవిగా.. రచయితగా రాణిస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు సముద్రాల శ్రీదేవి (Samudrala Sridevi). ఆమె తల్లిదండ్రులు వెంకటాచార్యులు, విమలాదేవి. తండ్రి పండితుడు కావడంతో శ్రీదేవి చిన్నతనం నుంచి కవితలు , పద్యాలు (Poems), నృత్యం (Dance) తో కథలు రాసేవారు. సాగర సంగమం సినిమాలో నుంచి ఓం నమశ్శివాయ అనే అనే పాట మీద నృత్యం చేసి అబ్బురపరుస్తున్నారు. సంగారెడ్డి (Sangareddy) జిల్లా పటాన్ చెరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పని చేస్తూ పుస్తకాలు రాస్తూ, సాహితీ వేత్తగా శ్రీదేవీ రాణిస్తున్నారు. పాఠశాలలో తెలుగు భాష ఉపాధ్యాయురాలిగా ఆమె విధులు నిర్వహిస్తూ విద్యార్థులకు తెలుగు భాష (telugu language) గొప్పదనాన్ని వివరిస్తున్నారు.
తెలుగు (Telugu)తోపాటు సాహితి సంస్కృతి లాంటి నేర్పి విద్యార్థుల (Students) గుండెల్లో నిలిచిన సముద్రాల శ్రీదేవి ఉపాధ్యాయురాలు తో పాటు ఇటీవల ఒకే వేదికపై తాను రచించిన 16 పుస్తకాలు ఆవిష్కరించారు. విషయం తెలుసుకున్న జిల్లా పాలనాధికారి హనుమంతరావు ఆమెను ప్రత్యేకంగా అభినందించి, సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె న్యూస్ 18కి ఇంటర్య్వూ ఇచ్చారు.
వందకుపైగా కవితలు, వ్యాసాలు.. వరించిన అవార్డులు.
సాహితీవేత్త (Literary)గా శ్రీదేవీ పలు అవార్డులు (Awards) అందుకున్నారు. పలు రచనలకు కవిచక్ర, సహస్ర కవి మిత్ర, గాన కోకిల బిరుదులు పొందారు. అంతేకాకుండా ఆమె గిడుగు రామమూర్తి పంతులు పురస్కారం, మెగా రికార్డ్ వారి మల్టీ టాలెంటెడ్ అవార్డు, జాతీయ తెలంగాణ సామాజిక సంస్థ వారి కవితల పోటీలో ప్రథమ స్థానం సాధించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు (Telugu Book of Records), తెలంగాణ జాగృతి బుక్ ఆఫ్ రికార్డు తదితర పురస్కారాలు అందుకున్నారు. జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది సముద్రాల శ్రీదేవి ప్రశంసాపత్రాలు, అంతర్జాతీయ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్కదులుతున్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
విద్యాభ్యాసం..
మెదక్ (Medak) జిల్లా దొంతి శివంపేట్ మండల కేంద్రంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు అక్కడే చదువుకొన్నారు. నర్సాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని అక్కడి నుంచి హైదరాబాద్లోని డిగ్రీ (Degree), పీహెచ్డీ (Ph D) చేశారు, టీచర్ ట్రైనింగ్ కూడా హైదరాబాద్లో (Hyderabad)ని చేశారు. తన తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో తన ప్రోత్సాహం తోటే ఈ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నానని సముద్రాల శ్రీదేవి (Samudrala Sridevi) తెలిపారు. తండ్రి తోడు తో సాహితీ కవితలు నృత్యం నేర్చుకున్నానని ఆమె news18 తో వివరించారు. విద్యార్థులకు నృత్యం కూడా స్కూల్లో నేర్పిస్తానని విద్యార్థులు ఎంతో సంతోషంగా కవితలు రాస్తారని ఆమె సంతోషంగా చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.