(Syed Rafi,News18,Mahabubnagar)అల్పపీడన ప్రభావం కారణంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ (Mahabubnagar)జిల్లా వ్యాప్తంగా రెండ్రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వనపర్తి(Wanaparthy)జిల్లాలో కురిసిన వర్షానికి ప్రాణనష్టం సంభవించింది. జిల్లాలోని ఆత్మకూరు(Atmakuru ) పట్టణానికి చెందిన ఆకుల కురుమూర్తి (Akula Kurumurthi)అనే 37సంవత్సరాల వయసున్న ప్రైవేటు కాలేజీ లెక్చరర్ కొత్తకోట మండల కేంద్రంలోని నివేదిత ప్రైవేటు కాలేజీ(Private college)లో జూనియర్ లెక్చరర్(Junior lecturer) గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం కాలేజీ ముగియగానే కొత్తకోట నుంచి ఆత్మకూరుకు బయలుదేరారు. తన స్వగ్రామమైన ఆత్మకూర్‌కు బైక్‌పై వెళ్తుండగా మధురపురం రైల్వే గేటు పరిధిలోని ఉకా శెట్టి వాగు వంతెనపై వరద నీరు భారీగా ప్రవేశించడంతో వరద ధాటికి ఆకుల కురుమూర్తి ఉపాధ్యాయుడు జారిపడి వాగులో గల్లంతయ్యాడు.
వరదలో కొట్టుకుపోయిన లెక్చరర్..
విషయాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసిన మదనాపురం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కురుమూర్తి భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మంజునాథ్ రెడ్డి తెలిపారు. మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపధ్యంలో ఎవరూ వంతెనలు, వాగులు దాటేందుకు సాహసం చేయవద్దని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Floods, Telangana News, Wanaparthi