Home /News /telangana /

TDP WILL BE ALTERNATIVE FOR TRS IN TELANGANA SAYS CHANDRABABU FOCUS TTDP IN TELANGANA WHILE APPRECIATING CM KCR MKS

శిష్యుడు KCRకు స్పాట్ పెడుతోన్న Chandrababu -రూ.2లక్షల అస్త్రం.. టీటీడీపీనే ప్రత్యామ్నాయం!

కేసీఆర్ తో చంద్రబాబు (పాత ఫొట)

కేసీఆర్ తో చంద్రబాబు (పాత ఫొట)

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు టీడీపీనే ప్రత్యామ్నాయం కావాలని, ఆ దిశగా పార్టీని బలోపేతం చేయాలని టీటీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ టీడీపీ ముఖ్యులతో ఆయన భేటీ అయ్యారు.

తెలంగాణలో దాదాపు కనుమరుగైన తెలుగుదేశం పార్టీకి తిరిగి పునరుజ్జీవనం కల్పించనున్నారా? టీటీడీపీ కార్యకలాపాలపై అధినేత చంద్రబాబు ఫోకస్ పెంచారా? ఒకప్పటి శిష్యుడు, ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా టీడీపీ మళ్లీ పుంజుకోనుందా? ఆమేరకు బాబు సమాలోచనలు జరుపుతున్నారా? తెలంగాణలోనూ సభ్యత్వ నమోదును భారీ ఎత్తున చేపట్టనున్నారా? అంటే ఆయన మాటలను బట్టి అవుననే సమాధానం వినిపిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు కీలక నిర్దేశం చేశారు. ఏపీ సీఎం జగన్ తో పోల్చుతూ కేసీఆర్ విధానాలను మెచ్చుకుంటూనే కారుకు సైకిల్ టక్కరిచ్చేలా చంద్రబాబు వ్యూహాత్మక సందేశమిచ్చారు..

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు టీడీపీనే ప్రత్యామ్నాయం కావాలని, ఆ దిశగా పార్టీని బలోపేతం చేయాలని టీటీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ టీడీపీ ముఖ్యులతో ఆయన భేటీ అయ్యారు. సిఫార్సులు, రికమండేషన్లతో నాయకులుగా ఎదగలేరని, క్షేత్రస్థాయిలో పోరాటాలతోనే నాయకత్వం వస్తుందని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో ఒకప్పుడు బలంగా ఉన్న టీడీపీ ఇప్పుడు బలహీనపడం ఎంత వాస్తవమో, మళ్లీ బలం పుంజుకుంటుంది అనేది అంతే నిజమని తెలిపారు.

CM KCR: కేసీఆర్ దూకుడు.. మళ్లీ ఢిల్లీకి.. ఈసారి లఖీంపూర్ ఖేరీ సందర్శన.. బీజేపీపై పోరు ఉధృతం!


తెలంగాణలో నెలకొన్న ప్రజాసమస్యలపై టీడీపీ శ్రేణులు రాజీలేని పోరాటం చేయాలని, సమస్యల్లో అండగా నిలిచినవారినే ప్రజలు ఆదరిస్తారని తెలంగాణ నేతలకు చంద్రబాబు సూచించారు. ఈనెల 25 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానున్న దరిమిలా తెలంగాణలో రెట్టించిన ఉత్సాహంతో సభ్యులను చేర్పించాలని చంద్రబాబు ఆదేశించారు.

Prashant Kishor: కాంగ్రెస్‌లోకి ప్రశాంత్ కిషోర్! -సోనియా గాంధీతో భేటీ -ఏం మాట్లాడుకున్నారంటే..


రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ పెద్ద నాయకులతోపాటు క్షేత్రస్థాయి శ్రేణులూ గులాబీ దళంలో కలిసిపోయిన క్రమంలో కొత్తగా పార్టీలో చేరికలను ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు. రూ.100 చెల్లించి టీడీపీ సభ్యత్వం పొందితే ఆ కార్యకర్తలకు రూ.2లక్షల బీమా వర్తిస్తుందని, దీనికి విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా చేరికల సంఖ్యను పెంచుకోవాలని టీటీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు.

KCR | Sanjay: ప్రాజెక్టులపై చర్చిద్దాం.. పాలమూరుకు రండి: సీఎంకు బీజేపీ బండి భారీ లేఖ


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోగానీ, విడిపోయిన ఏపీలోగానీ తన వల్లే అద్బుతమైన అభివృద్ది జరిగిందని, అది తనకెంతో సంతృప్తికరమని చంద్రబాబు పేర్కొన్నారు. తన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అభివృద్దిని చెడగొట్టలేదు కాబట్టే తెలంగాణలో తాను చేసిన అభివృద్ది ఇప్పటికీ నిలబడిందని, నాటి శ్రమకు నేడు అద్భుత ఫలితాలు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. అదే ఆంధ్రాలో మాత్రం తాను చేసిన అభివృద్దిని జగన్ చెడగొట్టడం వల్ల రాష్ట్రం పతనావస్థకు దిగజారిందని టీడీపీ చీఫ్ అన్నారు.

Ilayaraja: ఇళయరాజా.. ఇజ్జత్ ఉందా? -మోదీని అంబేద్కర్‌తో పోల్చిన మెస్ట్రోపై విమర్శల వెల్లువ


చంద్రబాబుతో సమావేశంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల ఇంచార్జి కంభంపాటి రామ్మోహన్ రావు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కాశీ విశ్వనాథ్, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డి, బండి పుల్లయ్య, రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు సమక్షంలో తెలంగాణలో టీడీపీకి ఇంకా పట్టున్న 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జిలు, సమన్వయకర్తలు, త్రీమెన్ కమిటీ సభ్యులను ప్రకటించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Chandrababu Naidu, CM KCR, TDP, Telangana, Trs, TTDP

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు