కారును ఢీకొట్టేందుకు సైకిల్ స్కెచ్...ఆ ఐదు స్థానాలపై టీడీపీ స్పెషల్ ఫోకస్

మ‌రో రెండు రోజుల్లో పార్టీ అధినేత చంద్ర‌బాబుతో స‌మావేశమై.. ఆ తర్వాత తెలంగాణలో టీడీపీ లోక్‌స‌భ అభ్య‌ర్ధ‌ుల జాబితాను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

news18-telugu
Updated: March 14, 2019, 5:51 PM IST
కారును ఢీకొట్టేందుకు సైకిల్ స్కెచ్...ఆ ఐదు స్థానాలపై టీడీపీ స్పెషల్ ఫోకస్
సైకిల్, కారు గుర్తులు
  • Share this:
(బాల‌కృష్ణ‌, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్18)

రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ప‌రిస్థితి 'డూ ఆర్ డై' అన్న చందంగా ఉంది. అటు ఏపీలో ఎలాగైనా అధికారంలోకి నిలుపుకోవాల్సిన ప‌రిస్థితి. ఇటు తెలంగాణ‌లో ప‌ట్టు కోల్పోయిన ఉనికిని కాపాడుకోవాల్సి దుస్థితి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో కూటమి క‌ట్టినా ప్ర‌భావం చూపించ‌క‌పోగా..మరింత పతానికి కారణమైంది. దాంతో కనీసం లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనైనా తమ ఉనికి చూపించ‌డానికి పార్టీ నేత‌లు తహతహలాడుతున్నారు. లోక్‌స‌భ అభ్య‌ర్ధ‌ుల ఎంపికలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు.

రాష్ట్ర‌ విభజన తర్వాత తెలంగాణ‌లో టీడీపీకి క్యాడర్ ఉన్నా నాయకత్వలేమితో బాధపడుతోంది. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర పరాజయం పార్టీ పరిస్థితి మరింత దిగజార్చింది. ఈ క్రమంలో లోక్‌సభలో ఎలాగైనా ప్రభావం చూపించాలని.. అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ‌లో త‌మకు పట్టున్న పార్లమెంట్ స్థానాలపై క‌స‌రత్తులు ప్రారంభించారు నేత‌లు. ముఖ్యంగా దేశంలోనే అతి లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజిగిరి స్థానాన్ని గెలుచుకోవాలని టీడిపి ప్ర‌త్యేక వ్యూహాంతో ముందుకెళ్తోంది. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్లారెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరపునే పోటీచేసి విజయం సాధించారు. తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన టీఆర్ఎస్‌లోకి వెళ్లారు.

మల్కాజ్‌గిరితో పాటు ఖమ్మం, మహబూబాబాద్, సికింద్రాబాద్, నాగర్‌కర్నూల్ లోక్‌స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తోంది టీడీపీ. ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కూడా కొలిక్కి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిలో సీనియర్ నేత దేవేందర్‌గౌడ్‌ను నిలబెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, సికింద్రాబాద్ నుంచి టీడీపీ సీనియర్ నేత విజయరావుకు టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక మ‌హబూబాబాద్, నాగ‌ర్ క‌ర్నూల్ అభ్య‌ర్థుల‌ ఎంపికపై చర్చలు జరుగుతున్నాయి. మ‌రో రెండు రోజుల్లో పార్టీ అధినేత చంద్ర‌బాబుతో స‌మావేశమై.. ఆ తర్వాత తెలంగాణలో టీడీపీ లోక్‌స‌భ అభ్య‌ర్ధ‌ుల జాబితాను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading